Begin typing your search above and press return to search.

బచ్చన్ హెల్త్ పై నానవతి ఆసుపత్రి ప్రకటన

By:  Tupaki Desk   |   12 July 2020 2:40 PM IST
బచ్చన్ హెల్త్ పై నానవతి ఆసుపత్రి ప్రకటన
X
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కొందరు మృతి కూడా చెందారు. అయితే అమితాబ్ ఇంకా ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ కరోనా పాజిటివ్ అంటూ నిర్దారణ అవ్వడం తో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమితాబ్ వంటి స్టార్ కు వైరస్ రావడం తో దేశ ప్రజలు మరింతగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళనగా ఎదురు చూస్తున్న సమయంలో ఆయనకు కు ట్రీట్మెంట్ ఇస్తున్న నానవతి ఆసుపత్రి వర్గాల వారు అధికారికంగా హెల్త్ బులిటెన్ ను విడుదల చేయడం జరిగింది. ఆందోళన అవసరం లేదని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఇద్దరు బచ్చన్ లను ఐసోలేషన్ ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక జయ బచ్చన్.. ఐశ్వర్యారాయ్ లకు నెగటివ్ వచ్చింది. ప్రస్తుతం బచ్చన్ ఫ్యామిలీ మొత్తం కూడా స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు.