Begin typing your search above and press return to search.

నానా పోయే రానా వచ్చే!

By:  Tupaki Desk   |   23 Oct 2018 9:31 AM GMT
నానా పోయే రానా వచ్చే!
X
మీటూ సెగలు కొందరికి నెగటివ్ గా ఉంటే మరికొందరికి పాజిటివ్ గా మారుతున్నాయి. తనుశ్రీదత్తా మొదలుపెట్టిన ఈ రచ్చ ఎక్కడెక్కడికో వెళ్తూ ఎవరెవరినో బయటికి లాగుతున్న విషయం చూస్తూనే ఉన్నాం. ముందు వచ్చిన పేరు నానా పాటేకర్ దే. అది తెలియడం ఆలస్యం నిర్మాతే వద్దన్నాడో లేక నానానే మానుకున్నాడో తెలియదు కానీ అప్పటికే నిర్మాణంలో హౌస్ ఫుల్ 4 నుంచి ఎగ్జిట్ అయిపోయాడు.

అంతే కాదు దాని దర్శకుడు సాజిద్ ఖాన్ మీద కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం అతన్ని కూడా తప్పించేలా హీరో అక్షయ్ కుమార్ ఒత్తిడి తేవడంతో బాలన్స్ ప్రాజెక్ట్ అదే టీమ్ లో అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్న ఫర్హాద్ సంజీ చేతుల్లో పడింది. షూటింగ్ త్వరలోనే కంటిన్యూ చేయబోతున్నారు. కాకపోతే నానా ప్లేస్ మాత్రం అలాగే ఉండిపోయింది.

తాజా సమాచారం మేరకు అది రానాతో భర్తీ చేయబోతున్నారట. మరి నానాకు రానాకు వయసులో చాలా వ్యత్యాసం ఉంది కదా అనే డౌట్ రావొచ్చు. అందుకే రానా ఇమేజ్ వయసుకు తగ్గట్టు స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారట. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న హౌస్ ఫుల్ 4లో ఓ హీరోయిన్ గా పూజా హెగ్డే కూడా నటిస్తోంది. ఇప్పటిదాకా నానా మీద తీసిన సీన్లన్నీ రానాతో రీ షూట్ చేయబోతున్నట్టు తెలిసింది.

తమ మీద వచ్చిన ఆరోపణలు రుజువు కానప్పటికీ చట్టప్రకారంగా నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకున్నాకే వేరే సినిమాలు ఒప్పుకోవాలని నానాతో పాటు సాజిద్ ఖాన్ డిసైడ్ అయినట్టు తెలిసింది. ఇప్పటికే హాథీ మేరె సాథీ మూవీ చేస్తున్న రానా ఖాతాలో ఈ వివాదం పుణ్యమా అని మరో బాలీవుడ్ సినిమా వచ్చి చేరింది