Begin typing your search above and press return to search.

న‌మ్రత చెప్పిన త్రీ ప‌ప్పీస్ స్టోరి

By:  Tupaki Desk   |   23 March 2020 4:20 PM IST
న‌మ్రత చెప్పిన త్రీ ప‌ప్పీస్ స్టోరి
X
ఈ ఫోటోలో మూడు ప‌ప్పీలు ఉన్నాయి. అవి ఏవో క‌నిపెట్టండి చూద్దాం? ఇంత‌కీ ఈ ఫ‌జిల్ వేసింది ఎవ‌రో కాదు న‌మ్ర‌త శిరోద్క‌ర్. త‌న ఫోన్ లో స్టాక్ ఫోటోల్లోంచి ఒక ఫోటోని తీసి ఇలా ఫ్యాన్స్ కి షేర్ చేసిన న‌మ్ర‌త ఈ త్రోబ్యాక్ పిక్చ‌ర్ చాలా స్పెష‌ల్ అంటూ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

ఇక ఈ ఫోటోలో ముగ్గురు కిడ్స్ ని ఎగ్జ‌యిట్ మెంట్ లో పప్పీ అంటూ ముద్దుగా పిలిచేశారు. ``ఈ రెండు ప‌ప్పీలు చాటింగ్ చేసుకుంటున్నాయి. మ‌ధ్య‌లో ర్యాండ‌మ్ బేబి ప‌ప్పీ ఎవ‌రో త‌న‌ని తాను క‌నిపెట్టే ప‌నిలో ఉంది. ఇంత‌కీ ఈ ప్లేస్ ఎక్క‌డిదో క‌నిపెట్టండి!`` అంటూ ఫ‌జిల్ వేసారు న‌మ్ర‌త‌.

అందులో గౌత‌మ్ .. త‌న స్నేహితురాలు ఆద్య ఆ మ‌ధ్య‌లో దూరంగా సితార క‌నిపిస్తున్నారు. హ‌మ్మ‌య్య ఆ ముగ్గురు ప‌ప్పీల్ని క‌నిపెట్టేశాం కాబ‌ట్టి ఇప్పుడు ఆ ప్లేస్ ఎక్క‌డో క‌నిపెట్టాల్సి ఉంటుంది. ఇంత‌కీ విదేశ‌మా స్వ‌దేశ‌మా? అదేదో ఫారిన్ వెకేష‌న్ ఫోటో అయితే కాదు. హైద‌రాబాద్ లో ఏదో స్టార్ హోట‌ల్లో స్నాక్స్ టైమ్ లో దిగిన‌దే అయ్యి ఉండాలి. ఒక‌వేళ అమెరికా వెకేష‌న్ కి వెళ్లిన‌ప్పటి ఫోటో అయితే ఆ సంగ‌తిని న‌మ్ర‌త‌నే చెప్పాల్సి ఉంటుంది. అన్న‌ట్టు ప‌ర‌శురామ్ తో మ‌హేష్ 27వ సినిమా ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చింది? అంటే స్క్రిప్టును ఫైన‌ల్ వెర్ష‌న్ వినాల్సి ఉంద‌ని తెలుస్తోంది. ఆ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఏదైనా చెబుతారా న‌మ్ర‌తా మ్యాడ‌మ్?