Begin typing your search above and press return to search.

1993 మిస్ ఇండియా.. సూపర్ స్టార్ భార్య!!

By:  Tupaki Desk   |   30 July 2020 2:30 AM GMT
1993 మిస్ ఇండియా.. సూపర్ స్టార్ భార్య!!
X
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల భార్యలు కెమెరా ముందు కనిపించడం అరుదుగా జరుగుతుంది. అందులోను ఇంటర్వ్యూలంటే ఇంకా అరుదుగా కనిపిస్తారు. మరి ఆ సెలబ్రిటీ భార్య కూడా ఒకప్పటి హీరోయిన్ అయితే.. ఆమె కూడా టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ఉంటే.. ఇలా కొన్ని ప్రత్యేకతలను కలిగిన హీరోయిన్ కం సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్. ప్రస్తుతం మహేష్ బాబుకు భార్యగా.. ఇద్దరు పిల్లలు గౌతమ్, సితారలకు తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. అయితే నమ్రత శిరోద్కర్ మిస్ ఇండియా టైటిల్ విజేత అని ఎంతమందికి తెలుసు. నమ్రత టైటిల్ విన్నర్ పేరు ప్రకటించే టైంలోని చిన్న వీడియోను నమ్రత సిస్టర్ శిల్ప శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే 1993లో నమ్రత మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది.

షోలో అడిగిన ప్రశ్నకు తన సమాధానంతో నమ్రత జడ్జీలను మెప్పించిందని శిల్పా శిరోద్కర్ తెలిపారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో మాజీ మిస్‌ ఇండియా సంగీత బిజ్లానీ కూడా కనిపించింది. మొత్తం ఐదుగురులో నెక్స్ట్ రౌండుకి ఏ ముగ్గురు వెళతారని సంగీతను హోస్ట్ అడగగానే.. "ఖచ్చితంగా నా ఫేవరెట్ కంటెస్టెంట్ నమ్రత టైటిల్ విన్ అవుతుందని చెప్పింది". ఆ తర్వాత నమ్రతను.. ‘మీరు ఓ ఉదయం లేచేసరికి కౌంట్‌ డ్రాక్యులా(కల్పిత పాత్ర) మీ బెడ్ పై నిద్రపోతూ కనిపిస్తే ఏం చేస్తారు? అని అడిగిన ప్రశ్నకు.. "నేను నిజంగా భయపడాతాను. కానీ ఆ డ్రాకులాతో స్నేహం చేస్తానని నమ్రత చెప్పుకొచ్చింది. జడ్జెస్ తో పాటు అందరూ క్లాప్స్ కొట్టారు. ప్రస్తుతం ఆ వీడియోలో తమ ఫేవరెట్ సూపర్ స్టార్ భార్య.. యవ్వనంలో ఉన్న నమ్రతను చూస్తూ మురిసిపోతున్నారు. ఇదిలా ఉండగా.. నమ్రత హిందీతో పాటు కన్నడ, తెలుగు, మలయాళ చిత్రాలలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత మహేష్ ప్రేమలో పడి 2005లో పెళ్లి చేసుకుంది.