Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఫ్యామిలీ ఫ్రాన్స్ షేక‌య్యేలా

By:  Tupaki Desk   |   29 April 2019 5:30 AM GMT
మ‌హేష్ ఫ్యామిలీ ఫ్రాన్స్ షేక‌య్యేలా
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ - న‌మ్ర‌త శిరోద్క‌ర్ జంట ఐడియాల‌జీ గురించి రెగ్యుల‌ర్ మీడియా కంటే నెటిజ‌నుల‌కే బాగా తెలుసు. నిరంత‌రం సామాజిక మాధ్య‌మాల్లో మ‌హేష్- న‌మ్ర‌త జోడీ విదేశీ విహారం లైవ్ లోకి వ‌చ్చేస్తుంటుంది. ఈ జంట ప్ర‌పంచ విహారాన్ని అమితంగా ఇష్ట‌డ‌ప‌తారు. ఛాన్స్ దొరికితే చాలు లండ‌న్.. న్యూయార్క్.. బ్యాంకాక్.. ఫ్రాన్స్.. యూర‌ఫ్ అంటూ విదేశీ యాత్ర‌ల‌తోనే కాల‌క్షేపం చేస్తుంటారు. అదో అడిక్ష‌న్.. మైండ్ రిలీఫ్ గేమ్ ప్లాన్! అని భావించాల్సి ఉంటుంది. అందుకే ఈ జంట వెకేష‌న్ గోల్స్ గురించి ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల్లో.. యువ‌త‌రంలో నిరంత‌రం ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంది. తాజాగా ఫ్రాన్స్ విహారానికి సంబంధించి న‌మ్ర‌త ఇన్ స్టాగ్ర‌మ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

ఈసారి ట్రిప్ లో గౌత‌మ్- సితార స‌హా బంధు మిత్రులు కూడా ఉన్నారు. మ‌హేష్ - గౌత‌మ్- సితార కాంబినేష‌న్ ఫోటోల‌ను న‌మ్ర‌త స్వ‌యంగా కెమెరాలో బంధించ‌డం తో ఆ ఫోటోల్లో న‌మ్ర‌త ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇక మ‌హేష్ ఫ్యామిలీ- బంధు మిత్రుల‌తో కూడుకున్న‌ గ్రూప్ ఫోటోలు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. మ‌హ‌ర్షి చిత్రీక‌ర‌ణ స‌హా డ‌బ్బింగ్ పూర్త‌యిన వెంట‌నే ఫ్యామిలీ స‌మేతంగా విదేశీ ట్రిప్ ప్లాన్ చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ క్ర‌మంలోనే మ‌హేష్ ఫ్రాన్స్ విజిట్ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

మే 9న మ‌హ‌ర్షి చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అంటే ఈ నెలాఖ‌రుతో ఫ్రాన్స్ విజిట్ పూర్తి చేసుకుని మ‌హేష్ తిరిగి ప్ర‌మోష‌న్స్ లో జాయిన్ అవుతారు. మీడియా ఇంట‌రాక్ష‌న్స్ కి అందుబాటులో ఉంటార‌ని తెలుస్తోంది. ప్ర‌చారానికి కేవ‌లం వారం మాత్ర‌మే మిగిలి ఉంది కాబ‌ట్టి ఆ మేర‌కు వంశీ పైడిప‌ల్లి- దిల్ రాజు బృందం ఆ ఏర్పాట్ల‌లో బిజీ బిజీ. మ‌హ‌ర్షి ప్రీరిలీజ్ వేడుక‌ను మే1 న హైద‌రాబాద్ నెక్లెస్ రోడ్ - పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ గా నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ 25వ సినిమా కాబ‌ట్టి త‌న‌తో ప‌ని చేసిన‌ 25 మంది ద‌ర్శ‌కుల్ని మ‌హేష్ ఈ వేదిక‌పై స్వ‌యంగా స‌న్మానించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈవెంట్ కి తార‌క్- చ‌ర‌ణ్ ఎటెండ‌వుతార‌ని ప్ర‌చారం సాగుతోంది. ట్రైల‌ర్ ని ఈ ఇద్ద‌రే రిలీజ్ చేయ‌బోతున్నారా? అంటూ ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.