Begin typing your search above and press return to search.

న‌మ్ర‌తా.. అమ్మ కూచీ నాన్న కూచీ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   18 July 2020 12:14 PM GMT
న‌మ్ర‌తా.. అమ్మ కూచీ నాన్న కూచీ ఎవ‌రు?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ - న‌మ్ర‌త శిరోద్క‌ర్ క‌పుల్ గోల్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ ఆద‌ర్శ‌ జంట గారాల‌ప‌ట్టీలు సితార‌- గౌత‌మ్ అల్ల‌రిని ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నే లేదు. ప్ర‌స్తుతం మ‌హేష్ షూటింగుల్లేక క్వారంటైన్ టైమ్ ని ఇంట్లోనే గ‌డిపేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే డాడీతో సీతాపాపా ఆటాపాట ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. గౌత‌మ్ కంటే మ‌హేష్ ఎంతో అల్ల‌రిగా గ‌డిపేస్తున్న ఫోటోలు ఇంత‌కుముందు ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లాయి.

ఇక గౌత‌మ్.. సితార‌కు సంబంధించిన ప్ర‌తి చిన్న అప్ డేట్ ని న‌మ్ర‌త శిరోద్క‌ర్ స్వ‌యంగా ఇన్ స్టా మాధ్య‌మంలో షేర్ చేస్తుంటారు. తాజాగా అన్నాచెల్లెళ్లు ఇద్ద‌రూ ఎంతో బుద్ధిగా ఇంట్లోనే ఉండి స్పెష‌ల్ గేమ్స్ ఆడుతూ ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఇక ఈ సెల్ఫీలో న‌మ్ర‌త శిరోద్క‌ర్ మాస్క్ వేసుకుని క‌నిపించారు. ఇలా ఫోటో ఇన్ స్టాలోకి రాగానే అలా మ‌హేష్ అభిమానుల్లో వైర‌ల్ అయిపోయింది.

స్వీయ‌నిర్భంధంలో ఎన్నో స్వీట్ మెమ‌రీస్ ని సెల‌బ్రిటీలు వోన్ చేసుకుంటున్నారు. గౌత‌మ్ సితార‌కు సంబంధించి ఇప్ప‌టికే మ‌ర‌పురాని ఆల్బ‌మ్ రెడీ అయ్యి ఉండాలి. మ‌హేష్ ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమాలో న‌టించాల్సి ఉండ‌గా.. మ‌హమ్మారీ స్పీడ్ కి త‌ట్టుకోలేక‌ వేచి చూసే ధోర‌ణితో ఉన్నారు. ఆగ‌స్టు నుంచి అయినా సెట్స్ కి వెళ్ల‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఈలోగానే త‌దుప‌రి స్క్రిప్టుల‌పైనా మ‌హేష్ దృష్టి సారించార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు సొంత బ్యాన‌ర్ లో అడివి శేష్ హీరోగా మేజ‌ర్ చిత్రాన్ని మ‌హేష్‌ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.