Begin typing your search above and press return to search.

నమ్రత.. ఓ ఫ్లాష్ బ్యాక్ ఫోటో!

By:  Tupaki Desk   |   7 Sep 2019 11:42 AM GMT
నమ్రత..  ఓ ఫ్లాష్ బ్యాక్ ఫోటో!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో తప్పనిసరిగా ఫాలో అయ్యే వ్యక్తి మహేష్ సతీమణి నమ్రత. కారణం అందరికీ తెలిసిందే. నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. మహేష్.. పిల్లలు గౌతమ్.. సితారలకు సంబంధించిన అప్డేట్లు ఇస్తూ ఉంటారు. రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటారు. తాజాగా నమ్రత ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

నమ్రత తన మోడలింగ్ రోజులనాటి ఒక పాత ఫోటోను పోస్ట్ చేసి "పాత ఫోటో.. అది మరో లోకం మరో కాలం. వర్క్ మోడ్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఫోటోను అందించిన తన స్నేహితురాలు సంగీతా రాఘవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫోటోలో నమ్రత పర్ఫెక్ట్ మోడల్ తరహాలో కనిపిస్తున్నారు. వైట్ డ్రెస్ లో ఎంతో స్టైలిష్ గా ఉన్నారు. ఇదే ఫోటోలో మరో ప్రముఖ మోడల్.. అర్జున్ రామ్ పాల్ మాజీ భార్య మెహర్ జెసియా కూడా ఉన్నారు.

నమ్రత మహేష్ ను వివాహమడక మునుపు మోడలింగ్ లో.. సినిమాల్లో సత్తా చాటారు. 1993 లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న నమ్రత ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 'కచ్చే ధాగే'.. 'వాస్తవ్'.. 'దిల్ విల్ ప్యార్ వ్యార్' 'పుకార్' లాంటి పలు హిందీ చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులో కూడా మహేష్ తో 'వంశీ'.. చిరంజీవితో 'అంజి' చిత్రాల్లో నటించారు. అయితే మహేష్ బాబును ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కుటుంబ బాధ్యతలు స్వీకరించి నటనకు దూరంగా ఉంటున్నారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత తన మోడలింగ్ రోజులను ఒక్కసారి గుర్తుచేసుకున్నారు. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో భారీగా స్పందన దక్కింది. చాలా అందంగా ఉన్నారు మేడమ్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు..