Begin typing your search above and press return to search.

మీ ప్రేమకు జోహార్లన్న నమ్రతా

By:  Tupaki Desk   |   22 March 2018 10:10 AM GMT
మీ ప్రేమకు జోహార్లన్న నమ్రతా
X
మహేష్ బాబుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేంత టైం ఉండదు కనక ఆ బాధ్యతను సతీమణి నమ్రతా శిరోద్కర్ రెగ్యులర్ గా పాటిస్తూ ఉంటారు. పిల్లలు గౌతం, సితారకు సంబంధించిన పిక్స్ కాని తమ కుటుంబం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ గడిపిన క్షణాలు కాని ఏవి చూడాలన్నా నమ్రతా ఎకౌంటు ను ఫాలో కావడమే. అందుకే తన ఫాలోయర్ల సంఖ్య భారీగా ఉంటుంది. తాజాగా నమ్రతా ఫాన్స్ కు థాంక్స్ చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేయటం ప్రస్తుతం అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. భరత్ అనే నేను షూటింగ్ లో పాల్గొనడానికి మహేష్ వచ్చిన సందర్భంలో ఫాన్స్ అతన్ని చూడాలని ప్రయత్నించడం, సెల్ ఫోన్స్ లో షూట్ చేయటం నమ్రత వద్దకు వీడియో రూపంలో వచ్చింది. దీన్ని తన సోషల్ మీడియా ఎకౌంటు లో షేర్ చేసిన నమ్రతా తను పెట్టిన మెసేజ్ లో అచ్చం మహేష్ మనసులో మాటలే చెప్పింది.

ఒక్క మనిషి కోసం ఇంత ప్రేమా. రోజు జరుగుతున్న ఈ మరపురాని సంఘటనలు చూస్తుంటే ఒకే ప్రేమ ఒకే భావోద్వేగం ఇలాగే చూపిస్తూ ఉండటం చూస్తుంటే మీ హద్దులు లేని ప్రేమకు థాంక్స్ అంటూ నమ్రతా పెట్టిన మెసేజ్ అభిమానులకు మహేష్ తరఫున గ్రీటింగ్స్ చెప్పేసింది. మహేష్ భార్య గానే కాకుండా తమ హీరో సినిమాలో హీరొయిన్ గా నటించిన నమ్రతా అన్నా ఫాన్స్ కు ప్రత్యేకమైన అభిమానం. మహేష్, నమ్రతలతో పాటు కృష్ణ కూడా నటించిన వంశీ సినిమా షూటింగ్ టైంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది.చిరంజీవితో అంజిలో నటించిన నమ్రతా పెళ్లి చేసుకున్నాక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. మహేష్ వ్యవహారాలు, పిల్లలు వీటితోనే టైం గడిచిపోతోంది. మొత్తానికి తన మెసేజ్ ద్వారా అభిమానుల మనసులు మరో సారి గెలుచుకున్న నమ్రతా పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.