Begin typing your search above and press return to search.

నమ్రత డ్రస్సింగ్.. టాటూ.. సూపర్!!

By:  Tupaki Desk   |   12 Aug 2016 12:51 PM GMT
నమ్రత డ్రస్సింగ్.. టాటూ.. సూపర్!!
X
నమ్రతా శిరోద్కర్.. ఓ పదేళ్లుగా ఈ పేరు కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య అనే ట్యాగ్ తో మాత్రమే వినిపిస్తోంది. బాలీవుడ్ లో 20 సినిమాలు.. తెలుగులో మహేష్ తో వంశీ.. చిరంజీవితో అంజి చిత్రాల్లో హీరోయిన్ గా కనిపించింది నమ్రత. అంతకంటే ముందు ఈమె మిస్ ఇండియా కూడా 1993లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న నమ్రత.. ఆ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో టాప్-6కి చేరిన బ్యూటీ.

మహేష్ తో పెళ్లయ్యాక గ్లామర్ ఇండస్ట్రీని పూర్తిగా పక్కన పెట్టేసింది ఈ మాజీ మిస్ ఇండియా. తను స్వయంగా క్రేజీ హీరోయిన్ అయినా.. సూపర్ స్టార్ కు ఫ్యామిలీకే టైమ్ అంతా కేటాయించేసింది. ఎక్కడా తను గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చాననే ఫీలింగ్ కూడా రానివ్వలేదు. మళ్లీ ఇన్నాళ్లకు కాసింత గ్లామర్ ని కురిపిస్తూ దర్శనమిచ్చింది. మోకాళ్ల వరకు ఉండే టాప్.. స్కర్ట్ తో ఓ ఈవెంట్ కి హాజరైంది నమ్రత. పింక్ కలర్ టార్.. మ్యాచింగ్ బ్యాగ్ తో హాట్ హాట్ గా సందడి చేసింది.

ఈ ఈవెంట్లో నమ్రత డ్రసింగ్ ఒక అట్రాక్షన్ అయితే.. ఆమె చేతిమీద పచ్చబొట్టుగా మెరుస్తున్న మహేష్ అనే ఇంగ్లీష్ అక్షరాలు అందరినీ ఆకర్షించాయి. సూపర్ స్టార్ వైఫ్ అయినా ప్రస్తుతం సింపుల్ గానే ఉంటున్న నమ్రత.. అటు బ్యాకెండ్ లో మహేష్ సినిమాలకు సంబంధించిన వ్యవహరాలు చూసుకుంటోంది.