Begin typing your search above and press return to search.

మహేష్ తో నటించడం లేదని తేల్చేసింది

By:  Tupaki Desk   |   14 Aug 2016 12:05 PM GMT
మహేష్ తో నటించడం లేదని తేల్చేసింది
X
వంశీ.. రిజల్ట్ ప్రకారం చూస్తే ఈ సినిమా మహేష్ బాబుకు ఓ చేదు అనుభవం. కానీ వ్యక్తిగత జీవితం కోణంలో చూస్తే మాత్రం అది అతడికి ఎప్పటికీ మరిచిపోలేని మధుర జ్నాపకం. ఎందుకంటే ఆ సినిమాతోనే నమ్రతా శిరోద్కర్ అతడికి పరిచయమైంది. ఆ సినిమా షూటింగ్ టైంలోనే ఆమెను అతను ప్రేమించాడు. తర్వాత ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.

ముంబయి అమ్మాయి.. తెలుగు కుటుంబంలో ఏమాత్రం సర్దుకుపోతుందో అని సందేహం వ్యక్తం చేశారు కానీ.. నమ్రత మాత్ర చక్కగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. నమ్రత వచ్చాక మహేష్ జీవితంలో కూడా చాలా మార్పులొచ్చాయి. మహేష్ ను పెళ్లాడాక సినిమాలు మానేసి కుటుంబం.. ఇతర బాధ్యతల్లో మునిగిపోయిన నమ్రత.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకుంటోందని.. మహేష్ కొత్త సినిమాలో ఓ క్యామియో రోల్ చేస్తోందని కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి.

ఐతే ఈ ప్రచారంపై నమ్రత స్వయంగా స్పందించింది. మహేష్-మురుగదాస్ సినిమాలో తాను నటిస్తున్నానన్న ప్రచారం ఉత్తదేనని.. తాను ఆ సినిమాలో నటించట్లేదని.. దీంతోనే కాదు మరే సినిమాలోనూ నటించే ఉద్దేశం తనకు లేదని ఆమె తేల్చి చెప్పింది. ప్రస్తుతం కుటుంబ బాధ్యతల్లో తాను తీరిక లేకుండా ఉన్నానని.. అలాగే మహేష్ కెరీర్ వ్యవహారాలు.. ప్రొడక్షన్ పనులు కూడా చూసుకుంటున్నానని.. సేవా కార్యక్రమాలకు కూడా సమయం వెచ్చిస్తున్నానని నమ్రత చెప్పింది.