Begin typing your search above and press return to search.

న్యూ లుక్ లో మహేష్ వైఫ్

By:  Tupaki Desk   |   16 Nov 2016 5:30 PM GMT
న్యూ లుక్ లో మహేష్ వైఫ్
X
గతంలో ఆమె ఓ బాలీవుడ్ హీరోయిన్! తెలుగు సినిమాలు కూడా చేసింది!పైగా ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ వైఫ్ కూడా. ఇప్పుడామె ఎవరో అర్ధమైపోయింది కదా. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ అలా కనిపించేసరికి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఓ నెల్లాళ్ల క్రితం కుటుంబంతో కలిసి తిరుమల వెంకన్న సన్నిధికి వెళ్లిన నమ్రత.. ఆ వెంకన్నకు మొక్కులో భాగంగా గుండు చేయించుకుందట.

అప్పటి నుంచి మీడియాకు కనిపించలేదు. అలాగే సోషల్ సైట్లలో కూడా యాక్టివ్ గా ఫోటోలు షేర్ చేసే నమ్రత ఆ పని కూడా చేయలేదు. ఇప్పుడు కొద్దిగా హెయిర్ వచ్చిన తర్వాత తన కొత్త లుక్ ని అభిమానులకు చూపించడం విశేషం. ప్రస్తుతం మహేష్ అండ్ ఫ్యామిలీ ముంబైలో ఉన్నారు. అక్కడ స్నేహితులు.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అలా తన అలనాటి ఓ స్నేహితురాలితో కలిసి దిగిన ఫోటో ఇలా మీడియాలోకి వచ్చింది.

మురుగదాస్ మూవీతో కొన్ని వారాలుగా ఫుల్లు బిజీగా ఉన్నా సరే.. ఫ్యామిలీ కోసం కొంత బ్రేక్ తీసుకున్న మహేష్ కూడా ఈ ఫోటోలో వెనక కనిపిస్తున్నాడు. సూపర్ స్టార్ తో అంత సీరియస్ గా డిస్కసన్స్ చేస్తున్నదెవరో కాదు.. మహేష్ కి ఎంతో సన్నిహితులైన దర్శకులు కొరటాల శివ.. మెహర్ రమేష్. ఇంతకీ మహేష్ ఏం మాట్లాడుతున్నాడబ్బా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/