Begin typing your search above and press return to search.

ఓన్లీ ఫర్‌ పిల్లలు.. నో మహేష్‌

By:  Tupaki Desk   |   23 July 2015 1:53 PM GMT
ఓన్లీ ఫర్‌ పిల్లలు.. నో మహేష్‌
X
నమ్రత శిరోద్కర్‌.. ఆల్‌ రౌండర్‌ ఫ్రం ఘట్టమనేని ఫ్యామిలీ. ప్రిన్స్‌ మహేష్‌ భార్యగానే కాదు, ఇప్పుడు టాలీవుడ్‌ నిర్మాతగానూ ఫేమస్‌ అవుతున్నారు. భవిష్యత్‌ లో పూర్తి స్థాయి నిర్మాతగా ఎదగడానికి ఇప్పట్నుంచే ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అలాగే పిల్లలు కాస్త అంది వస్తే తిరిగి ముఖానికి రంగేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ప్రస్తుతానికి మాత్రం పిల్లల్ని పెంచి పెద్దవాళ్లను చేయడమే ఓ తల్లిగా తక్షణ కర్తవ్యం.

మరి అసలే గౌతమ్‌, సితార అల్లరి చేసే వయసులో ఉన్నారు. కాబట్టి అలాంటివాళ్లను జోకొట్టాలంటే అప్పుడప్పుడు పాటలు పాడాల్సి ఉంటుంది. ఆ సంగతిని ఇటీవలే తెలుసుకున్నారో ఏమో! నమ్రత గౌతమ్‌ కోసం, చిన్నారి సితార కోసం పాటలు పాడుతున్నారు. ఈ సంగతిని తనే స్వయంగా చెప్పారు కూడా. గౌతమ్‌ కి డాడీ (మహేష్‌) సినిమాలోని పాటలంటే చాలా ఇష్టం. ఆసక్తిగా వింటాడు. అలాగే సితారని నిదుర పుచ్చాలంటే పాట పాడాల్సిందే. అప్పుడప్పుడు చిన్నపాటి డ్యాన్సులు కూడా చేస్తుంటానని నమ్రత చెప్పారు. సితారకు డాడీ సినిమాలోని రామ రామ సాంగ్‌ అంటే చాలా ఇష్టం.. అని చెప్పారు నమ్రత. పిల్లల ముందు పాడారు సరే.. మీ శ్రీవారి సమక్షంలో ఎప్పుడైనా పాడారా? అన్న ప్రశ్నకు ఆయన ఎదుట పాడను కానీ.. అంటూ సిగ్గుపడిపోయారు. అదీ సంగతి.