Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ సొంతూరికి కోడలి ప్రయాణం

By:  Tupaki Desk   |   16 March 2016 7:10 PM GMT
సూపర్ స్టార్ సొంతూరికి కోడలి ప్రయాణం
X
టాలీవుడ్ సూపర్ స్టార్ అంటే ఇప్పుడు మహేష్ బాబు గుర్తుకొస్తున్నాడు కానీ.. నిజానికి మన తెలుగు జనాలకు సూపర్ స్టార్ అంటే కృష్ణ నే. ఆయన తర్వాతే ఏ సూపర్ స్టార్ అయినా. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్స్ ఉండవు లెండి. మరి ఆ సూపర్ స్టార్ కృష్ణ సొంతూరు బుర్రిపాలెం. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో బుర్రిపాలెం ఓ గ్రామం. శ్రీమంతుడు రిలీజ్ తర్వాత మహేష్ బాబు దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లో బుర్రిపాలెం కూడా ఒకటి.

ఇప్పుడా గ్రామాన్ని మహేష్ భార్య నమ్రత విజిట్ చేయబోతోంది. ఆదర్శగ్రామంలా బుర్రిపాలెంను తయారు చేయాలన్నది మహేష్ బాబు ఆలోచన. భర్త మహేష్ అందించిన నిధులతో జరుగుతన్న పనులు ఏ మేరకు వచ్చాయో తెలుసుకునేందుకు, దగ్గరుండి పరిశీలించేందుకు నమ్రత బుర్రిపాలెం ప్రయాణం అవుతోంది. మార్చ్ 17వ తేదీ మొత్తం ఆమె అక్కడే ఉంటారని తెలుస్తోంది.

మహేష్ బావ, ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి నమ్రత బుర్రిపాలెం విజిట్ చేయనుంది. వీలైతే సలహాలు, కొన్ని సూచనలు కూడా చేసే అవకాశాలున్నాయట. ప్రస్తుతం మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ ని కంప్లీట్ చేస్తూ బిజిగా ఉండడంతో.. భార్యతో కలిసి బుర్రిపాలెం వెళ్లలేకపోతున్నాడని తెలుస్తోంది.