Begin typing your search above and press return to search.

ఆమెను ప్రత్యేకంగా కలిసిన నమ్రత!

By:  Tupaki Desk   |   31 Oct 2018 8:39 AM GMT
ఆమెను ప్రత్యేకంగా కలిసిన నమ్రత!
X
సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బెంద్రే ప్రస్తుతం న్యూయార్క్ లో క్యాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. హిందీ తో పాటుగా పలు తెలుగు సూపర్ హిట్స్ లో కూడా నటించిన సోనాలి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తెలుగులో చిరంజీవి - నాగార్జున - మహేష్ బాబు లాంటి టాప్ స్టార్స్ తో నటించింది సోనాలి.

మహేష్ బాబుతో సోనాలి 'మురారి' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అదే కాకుండా మహేష్ వైఫ్ నమ్రతాకు కూడా సోనాలి బెంద్రే పరిచయమే. నమ్రత.. సోనాలి ఇద్దరూ మహారాష్ట్రకు చెందిన వారు. మహేష్ బాబు 'మహర్షి' షూటింగ్ కోసం అమెరికాకు వెళ్ళాడు. మహేష్ తో పాటుగా నమ్రత - పిల్లలు గౌతమ్ సితారలు కూడా అమెరికాకు వెళ్లారు. న్యూయార్క్ లోనే ఉండడంతో వీలు చూసుకుని మరీ నమ్రత వెళ్లి సోనాలిని కలిసిందట. ఇద్దరూ కలిసి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. నమ్రత - సోనాలి గురించి మాట్లాడుతూ తను చాలా ధైర్యవంతురాలని.. త్వరలో కోలుకుని మామూలు మనిషవుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది.

మరోసారి కొడుకు గౌతమ్ తో పాటుగా సోనాలి భర్త గోల్డీ బెహెల్ ను సోనాలి కొడుకు రణవీర్ కలవాలని అనుకుంటోందట. క్యాన్సర్ తో పోరాడుతున్న సోనాలికి ఆమెకు తోడు నిలిచిన ఆమె కుటుంబానికి పలు బాలీవుడ్ ప్రముఖులు ఫోన్లు చేస్తూ.. వ్యక్తిగతంగా కలుస్తూ ధైర్యాన్నిస్తున్నారు. నమ్రత కూడా అదే బాటలో నడుస్తూ సోనాలిని కలవడం విశేషం.