Begin typing your search above and press return to search.

మహేష్ వైఫ్ భలే చెప్పిందిగా

By:  Tupaki Desk   |   12 Feb 2016 9:00 AM IST
మహేష్ వైఫ్ భలే చెప్పిందిగా
X
ఫిబ్రవరి 10తో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి అనుబంధం ఉంది. ఆ రోజున మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల పెళ్లి రోజు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న వీరిద్దరూ తమ 11వ మ్యారేజ్ యానివర్సరీని జరుపుకున్నారు. ఈ సందర్భంగా నమ్రత ఓ సూపర్బ్ కొటేషన్ తో తమ అనుబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

"గొప్ప పెళ్లిళ్లు అదృష్టంతోనో, అనుకోకుండానో జరగవు. కొంత నిర్దిష్టమై సమయాన్ని, ఆలోచనను, దయా గుణాన్ని, అనుబంధాన్ని, భక్తి భావాన్ని, పరస్పర గౌరవాన్ని, భార్యా భర్తల మధ్య చెదిరిపోని కమిట్మెంట్ ని పెట్టుబడిగా పెట్టినందుకు వచ్చే ఫలితమే.. గ్రేట్ మ్యారేజ్" అంటూ నమ్రత చేసిన ట్వీట్ చాలామందిని ఆకట్టుకుంది. 'మీ అందరి ప్రేమకు, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు'అంటూ ట్వీట్ చేసింది నమ్రత.

2005 ఫిబ్రవరి 10న సూపర్ స్టార్ మహేష్, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ ల పెళ్లి జరిగింది. ముంబైలోని మారియట్ హోటల్ లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా వీరికి ఉన్న గుర్తింపు తిరుగులేనిదని చెప్పాలి. ఇప్పుడు 11వ వార్షికోత్సవం సందర్భంగా నమ్రత చేసిన ట్వీట్.. మహేష్ దంపతుల అనుబంధాన్ని అద్దం పడుతోంది. పెళ్లికి మహేష్ వైఫ్ ఇచ్చిన డెఫినిషన్ చూశాక ఎవరైనా సరే ఆమెకు హ్యాట్సాఫ్ అనాల్సిందే.