Begin typing your search above and press return to search.
గోవా టూర్ వెళుతూ విమానంలో సర్కార్ వారి సందడే సందడి
By: Tupaki Desk | 14 Aug 2021 6:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ కథానాయిక. చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి గోవా వెళ్లింది. మహేష్ బాబు కుటుంబం .. భార్య నమ్రత శిరోద్కర్ .. పిల్లలు సితార- గౌతమ్ ఈ ట్రిప్ లో ఉన్నారు. ఇంతకుముందు కూడా సినిమా షెడ్యూల్ కోసం మహేష్ దుబాయ్ కి వెళ్లినప్పుడు కుటుంబమంతా విహారయాత్రకు వెళ్లింది. ఇప్పుడు కూడా అలానే గోవాకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ మహేష్ షూటింగులో బిజీ అయితే నమ్రత అండ్ ఫ్యామిలీ యాత్రను ఆస్వాధిస్తారు.
నమ్రత వారి స్నేహితులతో ఒక ప్రైవేట్ విమానంలో వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. గోవాకు వెళుతూ విమానంలో ఫన్ తో కోలాహలంగా కనిపిస్తున్నారు అంతా. సెకండ్ వేవ్ కరోనావైరస్ తర్వాత సర్కార్ వారి బృందం ఇటీవల హైదరాబాద్ లో సినిమా షూటింగ్ ని మొదలెట్టారు. ఇప్పుడు గోవాలో దిగి అక్కడా బీచ్ లో చిత్రీకరణలో బిజీ అయ్యారు.
#BLASTER కోసం బ్లాక్ బస్టర్ ప్రతిస్పందనతో జట్టు #సర్కారు వారి పాట పంప్ చేయబడింది. గోవాలో ఒక ఇంటెతో రెజ్యూమ్స్ షూట్.. ఆగష్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు నాడు సినిమా నిర్మాతలు `సర్కారు వారి పాట` టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం నుండి మహేష్ లుక్ ను మొదటిసారిగా ఆవిష్కరించారు. దీనికి గొప్ప స్పందన లభించింది. కీర్తి పక్కింటి అమ్మాయి పాత్రలో కనిపించగా.. మహేష్ ఇందులో కలెక్టర్ గా అప్పులు వసూలు చేసే వాడిగా డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. మహేష్ సరికొత్త హెయిర్ స్టైల్ తో మాసీ లుక్ తోనూ అలరించనున్నారు. అలాగే మహేష్ - కీర్తి లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ఓ రేంజులోనే వర్కవుటైందని టీజర్ తెలిపింది. థమన్ ఈ చిత్రానికి ట్యూన్ లు కంపోజ్ చేస్తున్నారు. 13 జనవరి 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
PSPK-రానా సినిమా- రాధే శ్యామ్ -F3 చిత్రాలు సంక్రాంతి బరిలో ఒకేసారి తెరపైకి రాబోతున్నాయి. వాటితో `సర్కార్ వారి పాట` పోటీపడనుంది. ఈ ఏడాది చివర్లో టీమ్ షూటింగ్ పూర్తి చేస్తుందని భావిస్తున్నారు. మహేష్ తదుపరి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తారు. పూజా హెగ్డే ఇందులో కథానాయికగా నటిస్తోంది.