Begin typing your search above and press return to search.

అర్జున్ ని డాడీని పొగిడిన నమ్రత

By:  Tupaki Desk   |   9 Sep 2017 5:53 AM GMT
అర్జున్ ని డాడీని పొగిడిన నమ్రత
X

హీరోయిన్ కెరీర్ బాగున్న టైంలో పెళ్లి చేసుకుని సినిమాలు పక్కన పెట్టేసి సంసార బాధ్యతలకే పరిమితమయ్యే హీరోయిన్లు తక్కువ మందే. ప్రిన్స్ మహేష్ బాబు నమ్రత కూడా ఇదే కోవలోకి వస్తుంది. ముంబయిలో పుట్టి పెరిగిన నమ్రత బాలీవుడ్ లో చాలానే సినిమాలు చేసింది. సంజయ్ దత్ తో నటించిన వాస్తవ్ - అనిల్ కపూర్ తో నటించిన పుకార్ లాంటి సినిమాలు నటిగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. మహేష్ బాబుతో వంశీ సినిమా చేస్తూ అతడిని ప్రేమించింది. తర్వాత పెళ్లి చేసుకుని తర్వాత సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేసింది.

నమ్రత ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అప్పుడప్పుడు మహేష్ బాబుకు సంబంధించి ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఓ హిందీ సినిమా చూసి బాగుందంటూ ఒపీనియన్ షేర్ చేసింది. అర్జున్ రామ్ పాల్ నటించిన డాడీ సినిమా చాలా బాగుందంటూ కితాబిచ్చింది. తాను చూసిన వాటిలో ఒన్ ఆప్ ది బెస్ట్ ఫిలిం అంటూ.. ఇందులో అర్జున్ రామ్ పాల్ నటన అద్భుతమని కామెంట్ పెట్టింది. ప్రముఖ పత్రికలు ఇచ్చిన స్టార్ రేటింగులతో కూడిన ఫొటోను కూడా షేర్ చేసింది.

197-80ల నడుమ బాంబేకు చెందిన గ్యాంగ్ స్టర్ కథతో డాడీ సినిమా రూపొందింది. ఇందులో అర్జున్ రామ్ పాల్ అరున్ గావ్లీ పాత్ర పోషించాడు. అట్టడుగు స్థాయి నుంచి ఓ వ్యక్తి నేర సామ్రాజ్యానికి అధినేతగా ఎదిగిన తీరుతో కథ సాగుతుంది. క్రైం డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్ నటనే హైలైట్ గా నిలిచిందని అంటున్నారు.