Begin typing your search above and press return to search.

మహేష్ సక్సెస్ వెనుక వి'నమ్రత'

By:  Tupaki Desk   |   22 Jan 2019 8:05 AM
మహేష్ సక్సెస్ వెనుక వినమ్రత
X
సూపర్ స్టార్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దూసుకుపోతున్న మహేష్ బాబు విజయం వెనుక సామెత చెప్పినట్టు కాదు కానీ నిజంగానే సతీమణి నమ్రత శిరోద్కర్ భాగస్వామ్యం చాలా ఉంది. కథలను ఎంచుకోవడం మొదలుకుని ప్రొడక్షన్ వ్యవహారాల దాకా అన్నింటిలోనూ చురుకైన పాత్ర ఉంటుంది కాబట్టి తన పుట్టిన రోజైన జనవరి 22 మహేష్ అభిమానులు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుని విషెస్ చెబుతుంటారు.

మహేష్ విదేశీ పర్యటనలు-పిల్లల బాగోగులు-మహేష్ నిర్మాణ సంస్థల వ్యవహారాలు-ఎఎంబి సినిమాస్ లావాదేవీలు- కథలు చెప్పేందుకు వస్తున్న వారితో మంతనాలు ఒకటేమిటి ఎన్నో రకాల బాధ్యతలు మోస్తూ ఎక్కడా చిరు నవ్వు తప్ప మరో ఫీలింగ్ చూపించకుండా సాగే నమ్రతా లాంటి భార్య ఉంటే సూపర్ స్టార్ కు ఇంక ఒత్తిడి ఏముంటుంది. ఈ మాటలో అతిశయోక్తి లేదు. ఇదంతా కంటి ముందు కనిపిస్తున్న వాస్తవమే.

మహేష్ నమ్రతల పరిచయం 2000వ సంవత్సరం వంశీ షూటింగ్ తో మొదలై తక్కువ సమయంలోనే ప్రేమ అటు నుంచి పెళ్లి దాకా వెళ్లిపోయింది. మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నా నాన్న కొడుకు కోడలు కలిసి నటించిన జ్ఞాపకంగా వంశీ సినిమా ఫ్యాన్స్ కు మిగిలిపోయింది. ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా మహేష్ కోసం కెరీర్ ని వదిలేసిన నమ్రతా షూటింగ్ లో జరిగిన ఆలస్యం వల్ల ఆఖరిగా విడుదలైన చిత్రం చిరంజీవి అంజి. ఆ తర్వాత నమ్రతా స్క్రీన్ మీద కనిపించలేదు. మహేష్ ను అంటిపెట్టుకుని పిల్లలు గౌతం సితారలే లోకంగా ఉంటోంది. మహేష్ కన్నా యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పర్సనల్ అప్ డేట్స్ ఇచ్చేది కూడా నమ్రతనే. అందుకే అభిమానులు మా అభిమాన హీరోకు దొరికిన ఆదర్శ ఇల్లాలు అని చెప్పుకుని మురిసిపోతుంటారు.