Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఇంటికి మ‌రో రేంజ్ రోవ‌ర్‌

By:  Tupaki Desk   |   10 Nov 2015 3:43 AM GMT
మ‌హేష్ ఇంటికి మ‌రో రేంజ్ రోవ‌ర్‌
X
రేంజ్ రోవ‌ర్ కార్లంటే మ‌హేష్‌ కి బోలెడంత ఇష్టం. వాటిని త‌న ఫేవ‌రేట్ కార్లుగా చెబుతుంటారాయ‌న‌. అది తెలుసుకొన్న ఆయ‌న శ్రీమ‌తి న‌మ్ర‌త ఒక బ‌ర్త్ డేకి గిఫ్టుగా ఇండియా తొలి రేంజ్ రేవ‌ర్ వోగ్యూ కారుని కొని మ‌హేష్ చేతిలో పెట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ గిఫ్టుని చూసి అప్ప‌ట్లో మ‌హేష్ వండ‌ర్ అయ్యాడు. కొన్నాళ్ల‌పాటు ఆ కారును న‌డ‌ప‌కుండా అలా చూస్తూనే ఆనంద‌ప‌డ్డాడ‌ట‌. ఇప్పుడు మాత్రం త‌న‌కి తానే మ‌రో రేంజ్ రోవ‌ర్ కారుని గిఫ్టుగా ఇచ్చుకొన్నాడు మ‌హేష్‌. ధ‌న త్ర‌యోద‌శి సంద‌ర్భంగా ఆ కారు మ‌హేష్ ఇంటికి వ‌చ్చింది. లేటెస్ట్ మోడ‌ల్ రేంజ్ రోవ‌ర్ కారు ముందు త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఫొటో కూడా తీయించుకొన్నాడు మ‌హేష్‌.

ఈ యేడాది మ‌హేష్‌ కి గుర్తుండిపోతుంది. శ్రీమంతుడుతో భారీ విజ‌యాన్ని అందుకొన్నాడు. త‌న కెరీర్‌ లోకెల్లా హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా అది నిలిచింది. దానికి మ‌హేష్ కూడా ఓ నిర్మాత కావ‌డంతో పెద్ద‌యెత్తున లాభాలొచ్చాయి. ఆ విజ‌యోత్సాహంలో మ‌హేష్ త‌న ద‌ర్శ‌కుడు శివ కొర‌టాలకి ఆడి కారును గిఫ్టుగా ఇచ్చాడు. ఇప్పుడు త‌న‌కి తాను ఓ రేంజ్ రోవ‌ర్ కారును కొన్నాడు మ‌హేష్‌. రేంజ్ రోవ‌ర్ మ్యాచో ఎస్‌.వి.యు మోడ‌ల్ కారు అది. చాలా ఖ‌రీదుంటుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. శ్రీమంతుడు సినిమాతో మ‌హేష్ ఇంట కొత్త కాంతులు నిండాయన్న మాట‌.