Begin typing your search above and press return to search.
ఆ పెళ్ళిలో నమ్రతదే హడావుడి
By: Tupaki Desk | 4 July 2018 10:51 PM ISTహైదరాబాద్ లో కొన్ని ఫ్యామిలీస్ కు సంబంధించి ఏదన్నా పెళ్ళి జరుగుతోంది అంటే మాత్రం.. ఆ హడావుడి తీరే ఒక రేంజులో ఉంటుంది. అలాంటి బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ ఒకటి ఇప్పుడు రెండు పెద్ద ఫ్యామిలీల్లో జరుగుతోంది. సినీ హీరో అఖిల్ మాజీ ప్రేయసి శ్రీయ భూపాల్ ఉంది చూశారు.. ఆమె మెగా కోడలు ఉపాసన కొణిదెల పిన్ని కొడుకు ఐంద్రిత్ ను పెళ్ళిచేసుకుంటోంది. ఈ పెళ్ళి గురించే ఇప్పుడు టాక్ అంతా..
ఆల్రెడీ శ్రీయ అండ్ ఐంద్రిత్ ల నిశ్చితార్ధం ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు దగ్గర్లో ఉన్న పెద్ద పురాతన ప్యాలెస్ లో జరిగింది. అయితే జమీందారి భవనంలో జరిగిందే పెళ్ళి అని అందరూ అనుకున్నారు. కాని అది కేవలం ఎంగేజ్మెంట్ అని ఇప్పుడే తెలిసింది. జివికె కూతురు షాలిని కూతురు అయిన శ్రీయకు.. అపోలో గ్రూప్ కు ఒకానొక వారసుడు అయిన ఐంద్రిత్ కు పెళ్ళంటే..మరి గ్రాండ్ రేంజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఈ పెళ్ళిలో ఉపాసన కు మంచి ఫ్రెండ్ అయిన నమ్రత శిరోద్కర్ తన చిన్నారి కూతురు సితారతో కలసి పాల్గొంది. వరుసగా అందరితోనూ ఫోటోలు దిగేసి.. అవన్నీ నెట్లో పెట్టేసింది సూపర్ స్టార్ వైఫ్. అవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు కొత్త సినిమా.. 25వ సినిమా.. ప్రమోషన్లను అప్పుడే మొదలుపెట్టించేసింది నమ్రత. ఈ సినిమాకు #mahesh25 అనే ట్యాగ్ కాకుండా.. #ssmb25 అనే ట్యాగ్ వాడాలంటూ ఫ్యాన్స్ కు తన టీమ్ ద్వారా సందేశం పంపేసి.. అప్పుడే సినిమా గురించి పబ్లిసిటీ చేయిస్తోంది. అది సంగతి.
