Begin typing your search above and press return to search.

మ‌హేష్ బాబుతో న‌మ్ర‌త గొడ‌వ ప‌డ‌తారా?

By:  Tupaki Desk   |   17 Dec 2022 8:30 AM GMT
మ‌హేష్ బాబుతో న‌మ్ర‌త గొడ‌వ ప‌డ‌తారా?
X
దాదాపు ఇర‌వై రెండేళ్ల క్రితం బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మూవీ 'వంశీ'. సూప‌ర్ స్టార్ కృష్ణ కీల‌క పాత్ర‌లో మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన ఈ మూవీ ద్వారా న‌మ్ర‌తా శిరోద్క‌ర్ హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది.

ఈ మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే ప్రేమ‌లో ప‌డిన ఈ మాజీ మిస్ ఇండియా 2005లో మ‌హేష్ ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. వివాహానంత‌రం గృహిణిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూ సినిమాల‌కు న‌మ్ర‌త‌ శాశ్వ‌తంగా గుడ్ బై చెప్పేసింది.

తాజాగా ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన న‌మ్ర‌త .. మ‌హేష్ గురించి, త‌న వైవాహిక జీవితం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. మ‌హేష్ బాబు నేను పెళ్లి చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకున్న రోజు నా జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. నా లైఫ్ లోనే ఎంతో సంతోష‌క‌ర‌మైన రోజ‌ది. పెళ్లి త‌రువాత త‌న ప్ర‌పంచ‌మే మొత్తం మారిపోయింద‌న్నారు. మాతృత్వాన్ని పొంద‌డం గొప్ప అనుభూతి అని మురిసిపోయారు.

సినిమాల్లోకి ప్ర‌వేశించ‌డానికి ముందు తాను మోడ‌లింగ్ రంగంలో వున్నాన‌ని, ఒక ద‌శ‌లో మోడ‌లింగ్ బోర్‌కొట్ట‌డంతో సినిమాల్లోకి ప్ర‌వేశించాన‌ని చెప్పుకొచ్చారు. సినిమా రంగంలో న‌టిగా ప్ర‌తి ప‌నిని ఎంతో ఆస్వాదిస్తూ చేశాన‌ని, అప్పుడే మ‌హేష్ ను క‌లిశాన‌న్నారు. మేమిద్ద‌రం పెళ్లి చేసుకున్నాం. త‌న‌కు కాబోయే శ్రీ‌మ‌తి ఎలా వుండాలో స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న వుంది. అందుకే నేను సినిమాల‌కు దూర‌మ‌య్యాను అని అన్నారు న‌మ్ర‌త‌.

వివాహం చేసుకున్న త‌రువాత కూడా నాకు సినిమాల్లో న‌టించే అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే నాకు న‌టించాల‌నే ఉద్దేశ్యం అస్స‌లు లేదు. మ‌హేష్ కు నాకు మ‌ధ్య గొడ‌వ‌లు అస్స‌లే రావు. ఒక వేళ మా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చినా అవి పిల్ల‌ల విష‌యంలోనే. పిల్ల‌లు త‌మ‌కు ఏం కావాల‌న్నా ఆయ‌న‌నే అడుగుతుంటారు. ఆయ‌న కాద‌ని చెప్ప‌రు. కానీ నేను నో అంటుంటాను. ఆ విష‌యంలో స‌ర‌దాగా మా మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి అని తెలిపింది.

మ‌హేష్ న‌టించిన సినిమాల్లో ఏ సినిమా ఇష్ట‌మ‌ని అడిగితే.. 'పోకిరి' సినిమా అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, ఆ సినిమాలో మ‌హేష్ చెప్పే పంచ్ డైలాగ్ ల‌ని చాలా ఇష్ట‌ప‌డ‌తాన‌ని తెలిపింది. మ‌హేష్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో త‌న 28వ ప్రాజెక్ట్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రీసెంట్ గా స్టోరీ మొత్తం మార‌డంతో ఫ్రెష్ గా జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ని మొద‌లు పెట్ట‌బోతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.