Begin typing your search above and press return to search.

నమ్రత మాత్రం కాస్త డిఫరెంటే

By:  Tupaki Desk   |   17 July 2016 6:45 AM GMT
నమ్రత మాత్రం కాస్త డిఫరెంటే
X
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం హరిత హారం. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ సెలబ్రిటీల నుంచి మంత్రుల వరకూ అందరూ ఈ ప్రకృతి కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలనే స్ఫూర్తిని కలిగించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం దూసుకుపోతోందనే చెప్పాలి.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ప్రతీ ఒక్కరూ తమ ఇంట్లో పరిసరాల్లోనో మొక్కలు నాటేసి హరితహారంలో పాల్గొంటే.. ఈమె మాత్రం డిఫరెంట్‌ రూట్ ను ఎంచుకుంది. మహేష్ బాబు తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు మండలంలో సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. సిద్ధాపూర్ లో పర్యటించిన నమ్రత.. అక్కడ హరితహారంలో పాల్గొని.. గ్రామస్తుల్లో స్ఫూర్తి నింపింది.

ఒక వైపు మహేష్ సినిమాలకు సంబంధించిన పనులతో పాటు.. మరోవైపు మహేష్ దత్తత తీసుకున్న కార్యక్రమాలను కూడా చూసుకుంటూ.. భార్యగా తన బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తోందనే పేరు తెచ్చుకుంటోంది నమ్రత. మహేష్ గత మూవీలకు సంబంధించిన ప్రమోషన్ కం ఫైనాన్స్ డీలింగ్స్ ను నమ్రత హ్యాండిల్ చేసిన సంగతి తెలుసు కదా.