Begin typing your search above and press return to search.

న‌మ్ర‌తా మ‌హేష్ ఈ కొత్త లుక్ బావుందే!

By:  Tupaki Desk   |   11 Feb 2021 4:30 PM GMT
న‌మ్ర‌తా మ‌హేష్ ఈ కొత్త లుక్ బావుందే!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ - న‌మ్ర‌త జంట ఆదర్శ దాంప‌త్యం అంద‌రికీ స్ఫూర్తి. 16 వ వెడ్డింగ్ యానివ‌ర్శ‌రీ సంద‌ర్భంగా ఈ జంట ల‌వ్ లీ గ‌తానికి సంబంధించిన‌ మెమ‌రీస్ లోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ త‌న స‌తీమ‌ణికి స్వీట్ కిస్ ఇచ్చి అభినందించ‌గా.. తాను కూడా అలాంటి ఒక ప్రేమ పూర్వ‌క చుంబ‌నంతో విషెస్ చెబుతున్న ఓ త్రోబ్యాక్ ఫోటోని షేర్ చేశారు.

ఇక మ‌హేష్ - న‌మ్ర‌త జోడీ ఇటీవ‌ల దుబాయ్ లో వెకేషన్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ అడ్వెంచ‌ర్ స్పోర్ట్ ని కిడ్స్ స‌హా ఆస్వాధించారు న‌మ్ర‌త అండ్ కో. అనంత‌రం మ‌హేష్ స‌ర్కార్ వారి పాట చిత్రీక‌ర‌ణ‌లో జాయిన్ అయ్యారు.

తాజాగా న‌మ్ర‌త త‌న‌కు అత్యంత ప్రీతిపాత్రురాలైన ఓ విదేశీ చెఫ్ ఫోటోని షేర్ చేసి బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. ప్యారిస్ కి చెందిన ప్ర‌ముఖ చెఫ్ మ‌రిలోవ్ ఫిలిప్స్ కి ప్ర‌త్యేకించి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంటూ త‌న‌తో క‌లిసి ఉన్న గ్రూప్ ఫోటోని షేర్ చేశారు. ``హ్యాపీయెస్ట్ బ‌ర్త్ డే అండ్ బ్లెస్సింగ్స్.. ల‌వ్ యు మ‌రిలోవ్ ఫిలిప్స్.. ఫ‌రెవ‌ర్!`` అంటూ వ్యాఖ్య‌ను ఫోటోకి జోడించారు. ప్ర‌స్తుతం ఈ ఎక్స్ క్లూజివ్ ఫోటో మ‌హేష్ అభిమానుల్లోనూ వైర‌ల్ అవుతోంది. ఈ త్రోబ్యాక్ ఫోటోలో న‌మ్ర‌త లేడీ బాండ్ నే త‌ల‌పిస్తోంది. ఆ లుక్ సంథింగ్ స్పెష‌ల్ గా ఉంద‌ని అభిమానులు అంటున్నారు.

న‌మ్ర‌త - మ‌హేష్ అండ్ ఫ్యామిలీ ఇంత‌కుముందు ప్యారిస్ వెకేష‌న్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ మ‌రిలోవ్ ఫిలిప్స్ వంట‌కాల్ని రుచి చూశాక‌.. త‌న‌ని మ‌ర్చిపోలేద‌న్న‌మాట‌. మ‌రిలోవ్ కజ్జికాయ‌లు స‌హా ఇటు ఆంధ్రా స్టైల్ వంట‌ల్ని వండుతున్న ఫోటోలు ఇన్ స్టాలో క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రం.