Begin typing your search above and press return to search.

ప‌సుపు పూసుకుని పెళ్లికూతురైన న‌మ్ర‌త‌

By:  Tupaki Desk   |   18 July 2020 6:45 AM GMT
ప‌సుపు పూసుకుని పెళ్లికూతురైన న‌మ్ర‌త‌
X
సూపర్ స్టార్ మహేష్ బాలీవుడ్ క‌థానాయిక న‌మ్ర‌తల‌ ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. `వంశీ` సినిమాలో క‌లిసి న‌టించారు. ఆరేడేళ్ల ప్రేమాయ‌ణం అనంత‌రం వ‌న్ ఫైన్ డే పెళ్లాడేశారు. అందుకు ఇరు కుటుంబీకుల స‌మ్మ‌తం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ జంట‌కు ముచ్చ‌ట‌గా ఇద్ద‌రు వార‌సులు. కిడ్స్ గౌత‌మ్ - సితార చూస్తుండ‌గానే వేగంగా ఎదిగేస్తున్నారు. మ‌హేష్ లైఫ్ లో అన్నీ న‌మ్ర‌త‌నే. అత‌డిని హీరో నుంచి సూప‌ర్ హీరోగా ఎదిగేందుకు చేయాల్సింది అంతా చేసింద‌ని చెబుతారు. ఇప్పుడు ఏఎంబీ సినిమాస్ పేరుతో మ‌హేష్ బిజినెస్ లో అడుగు పెట్టారంటే న‌మ్ర‌త ఇచ్చిన భ‌రోసానే. అత‌డిని ఎంట‌ర్ ప్రెన్యూర్ గానూ మార్చేశారు న‌మ్ర‌త‌.

ఇంత సుదీర్ఘ‌మైన ప్ర‌యాణంలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా అన్యోన్య‌త ఎక్క‌డా చెక్కు చెద‌ర‌లేదు. ఇద్ద‌రి మ‌ధ్యా అండ‌ర్ స్టాండింగ్ ప్ర‌తిసారీ అభిమానుల‌కే కాక అంద‌రికీ స‌ర్ ప్రైజ్ అనే చెప్పాలి. 2005 లో నమ్రతను మ‌హేష్ వివాహం చేసుకున్నారు. దాదాపు పదిహేనేళ్ళు అయ్యింది. ఇద్ద‌రు ల‌వ్ లీ పిల్ల‌ల‌తో సంతోషకరమైన కుటుంబజీవ‌నం సాగిస్తూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

ఇక త‌మ ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన విశేషాల్ని నమ్రతా ఇన్ స్టా లో రెగ్యుల‌ర్ గా వెల్ల‌డిస్తూనే ఉంటారు. తాజాగా త‌న పాత జ్ఞాప‌కాల నుంచి ఓ అరుదైన పెళ్లి ఫోటోని న‌మ్ర‌త అభిమానుల‌తో పంచుకుంది. ఈ ఫోటోలో చిరస్మరణీయమైన పెళ్లి రోజుకు ముందు నమ్రత తన హల్దీ వేడుకను ఆస్వాధిస్తోంది. రేర్ మూవ్ మెంట్ అది. పెళ్లి కూతురుగా మ‌ధుర జ్ఞాప‌కాన్ని మ‌దిలో ప‌దిల‌ప‌ర్చుకున్నారు న‌మ్ర‌త‌. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tags: