Begin typing your search above and press return to search.

టీనేజీ త‌న‌యుడి సోలో యాత్ర‌పై న‌మ్ర‌త ఎమోష‌న్!

By:  Tupaki Desk   |   21 Jan 2023 5:30 AM GMT
టీనేజీ త‌న‌యుడి సోలో యాత్ర‌పై న‌మ్ర‌త ఎమోష‌న్!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఎదుగుద‌ల వెన‌క నమ్రత శిరోద్కర్ పాత్ర గురించి అభిమానులు నిరంత‌రం చ‌ర్చించుకుంటారు. ఇప్పుడు త‌న‌యుడు గౌత‌మ్ కృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని ఎదుగుద‌ల కోసం న‌మ్ర‌త త‌పిస్తున్న తీరు త్యాగాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

మొద‌టి సారి త‌న‌నుంచి దూరంగా వెళుతున్న త‌న గారాల‌ప‌ట్టీ.. వార‌సుడు గౌత‌మ్ కృష్ణ‌ను త‌ల‌చి న‌మ్ర‌త ఎంతో ఎమోష‌నల్ అయ్యారు. ఆ సంగ‌తి త‌న ఇన్ స్టా పోస్ట్ వెల్ల‌డిస్తోంది. గౌత‌మ్ ఇటీవ‌లే ప‌దో త‌ర‌గతి విద్య‌ను పూర్తి చేసాడు. ప్ర‌స్తుతం అత‌డు విదేశాలకు తన మొదటి సాంస్కృతిక పర్యటనకు బయలుదేరాడు...''అంతా తనకు తానుగానే!'' అంటూ న‌మ్ర‌త ఉప్పొంగిపోతూ ఎమోష‌న‌ల్ గా త‌న సామాజిక మాధ్య‌మాల్లో స్వ‌రాన్ని వినిపించారు.

దాదాపు నాలో కొంత భాగం న‌న్ను విడిచిపెట్టినట్లు ఉంది! అంటూ నమ్ర‌త ఎమోష‌న‌ల్ అయ్యారు ఈ సంద‌ర్భంలో. అతడు(గౌత‌మ్) వెళ్ళే వరకు రోజంతా నేను అనుభవించిన ఈ శూన్యత.... ఆపై అది సాధారణ స్థితికి రావడం వ‌ర‌కూ.. నెమ్మదిగా... ఇది అతడు తిరిగి వచ్చే వరకు ఎప్పటికీ గుర్తుండిపోయే విచార‌కరమైన అనుభూతి.

మా ఇల్లు .. మా కళ్ల ముందు .. మా చిన్న పిల్లవాడు గూడు విడిచాడు. ఎగిరి(విమానంలో) వెళ్లాడు.. నా పిల్లాడికి ఒక వారం వినోదం.. ఆనందం.. సాహసం .. అన్నింటికంటే మించి.. నిన్ను నీవు కనుగొనాలని కోరుకుంటున్నాను.. ఈ యాత్ర పూర్తిగా విలువైనదని ఆశిస్తున్నాను నా బేబీ... నిన్ను తిరిగి ఇక్క‌డ చూసే వ‌ర‌కూ వేచి ఉండలేను'' అంటూ ఎమోష‌న‌ల్ నోట్ రాసారు. #టీన్స్ #స్వాతంత్య్రం.. అంటూ హ్యాష్ ట్యాగ్ ల‌తో ఈ పోస్ట్ ని వైర‌ల్ చేసారు.

కొడుకు గౌతమ్ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినందుకు నమ్రతా శిరోద్కర్ ఇటీవ‌ల ఒక‌ తల్లిగా ఎంతో గ‌ర్వించారు. అదే క్ర‌మంలో అప్ప‌ట్లో సుదీర్ఘమైన పోస్ట్ ను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. నమ్రత తన కొడుకు గురించి ఎంత గర్వపడుతున్నారో రాసిన తీరు అభిమానుల హృద‌యాల‌ను తాకింది.

మహేష్ బాబు- న‌మ్ర‌త జంట‌ వివాహం సుమారు 17 సంవత్సరాల క్రితం జ‌రిగింది. వారికి ఇద్దరు పిల్లలు ..గౌతమ్ -సితార. గౌత‌మ్ టీనేజీలో ప్ర‌వేశించాడు. సొంతంగా ప్ర‌యాణించే స్వాతంత్య్రం అత‌డికి వ‌చ్చినా ఇప్ప‌టికీ త‌న‌ను ఒక ప‌సిబాబులా కంటికి రెప్ప‌లా చూసుకుంటూ ఎమోష‌న్ కి గుర‌వుతున్నారు న‌మ్ర‌త‌.

2018 నుండి వృత్తిపరంగా స్విమ్మింగ్ లో రాణిస్తూ గౌతమ్ తన ఏజ్ గ్రూప్ లో తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ పోటీల్లో టాప్ 8 పోటీ స్విమ్మర్ లలో ఒక‌డిగా తన స్థానాన్ని సాధించుకున్నాడు. బటర్ ఫ్లై బ్యాక్ స్ట్రోక్.. బ్రెస్ట్ స్ట్రోక్ ... ఫ్రీస్టైల్ లో గౌత‌మ్ సులభంగా ఈద‌గ‌ల‌డు. త‌న‌కు ఇష్టమైన ఎండ్యూరెన్స్ ఫ్రీస్టైల్ లో 3 గంటల్లో 5 కిలోమీటర్లు ఈదాడు. అత‌డు సుకుమార్ తెర‌కెక్కించిన '1: నేనొక్కడినే'లో చిన్న‌ప్ప‌టి మహేష్ బాబు పాత్ర‌లో మెరిసాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.