Begin typing your search above and press return to search.

మహేష్ స్టిల్ ని బలే మ్యాచ్ చేసింది

By:  Tupaki Desk   |   30 Aug 2017 4:58 PM GMT
మహేష్ స్టిల్ ని బలే మ్యాచ్ చేసింది
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత స్టార్ హోదాలో ఉన్నా తన ఫ్యామిలీ దగ్గర మాత్రం చాలా సింపుల్ గా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. ఆయన భార్య నమ్రత కూడా మంచి తల్లిగా భార్యగా ఇంట్లో ఉంటూ చక్కగా ఫ్యామిలీ చూసుకుంటూ.. మరో ప్రక్కన మహేష్‌ కు సంబంధించిన పనులన్నీ చూస్తుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ప్రేక్షకులకు దూరమైనా.. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు అభిమానులకు దగ్గరగానే ఉంటారు. ప్రతి సంతోషమైన వార్తను ఫ్యాన్స్ తో పంచుకొని వారికి సప్రైజ్ ని ఇస్తుంటారు.

ముఖ్యంగా సితార - గౌతమ్ లకి సంబందించిన ఫోటోలను ఆమె తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే రీసెంట్ గా మరొక అరుదైన ఫోటోని పోస్ట్ చేసి అందరిచేత వావ్.. అనిపించింది. ప్రస్తుతం మహేష్ "స్పైడర్" సినిమా చివరి పాటు చిత్రీకరణలో రొమేనియాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా హీరోయిన్ రకుల్ సెట్ లో ఉన్న మహేష్ తో దిగిన ఫోటోలని మనం ఆల్రెడీ చూసేశాం. దీంతో మహేష్ సతీమణి నమ్రత కూడా ఆ సెట్ లో మహేష్ దిగిన ఫోటోకి ఎవర్ గ్రీన్ నటుడు కృష ఫోటోని జతచేసి తన అభిమానులకు షేర్ చేసింది.

"అప్పుడు.. ఇప్పుడు.. మా లెజెండరీ మామగారు- ఆయన అందమైన కుమారుడు'' అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ ఆ ఫోటీని తెగ షేర్ చేస్తున్నారు. ఆ లుక్ లో మహేష్ స్టిల్ కృష్ణ కి మ్యాచ్ అవ్వడం బలే కొత్తగా ఉంది అంటున్నారు అభిమానులు.