Begin typing your search above and press return to search.

అప్పట్లో నేను మహేశ్ ను లవ్ చేస్తున్నట్టు మంజులకు తెలియదు: నమ్రత

By:  Tupaki Desk   |   20 Aug 2022 12:30 AM GMT
అప్పట్లో నేను మహేశ్ ను లవ్ చేస్తున్నట్టు మంజులకు తెలియదు: నమ్రత
X
టాలీవుడ్ లో ప్రేమ వివాహాలు చేసుకున్న స్టార్ హీరోలలో మహేశ్ బాబు ఒకరు. మహేశ్ బాబుతో పెళ్లికి ముందే నమ్రత బాలీవుడ్ లో 20 సినిమాల వరకూ చేశారు. ఆ తరువాత తెలుగులో మహేశ్ బాబు జోడీగా 'వంశీ' సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వాళ్లిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారడం .. పెద్దల అంగీకారంతో 2005 ఫిబ్రవరి 10వ తేదీన పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. అప్పటి నుంచి కూడా కృష్ణ ఫ్యామిలీ ప్రతిష్ఠకి తగినట్టుగానే ఆమె తన బాధ్యతను నిర్వహిస్తూ వస్తున్నారు.

మహేశ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటారు. అందువలన పిల్లల ఆలనా పాలనను నమ్రత చూసుకుంటూ వస్తున్నారు. అలాగే సొంత నిర్మాణ సంస్థకి సంబంధించిన విషయాలను కూడా ఆమెనే చాలావరకూ చక్కబెడుతూ ఉంటారు.

సోషల్ మీడియాలోను ఆమె చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. మహేశ్ బాబు ఫ్యామిలీలోని అందరితో ఆమె ప్రేమాభిమానాలతో నడచుకుంటూ ఉంటారు. అయితే అందరిలోను మంజులతో ఆమె మరింత చనువుగా ఉంటారు. ఈ విషయాన్ని ఆమెనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

మంజుల గురించి నమ్రత మాట్లాడుతూ .. "మంజుల నేను ఒక ఫంక్షన్ లో కలుసుకున్నాము .. అప్పటి నుంచి ఇద్దరం మంచి స్నేహితులమయ్యాము. అప్పటికే నేను మహేశ్ తో లవ్ లో ఉన్నాను. కానీ ఆ విషయం ఆమెకి తెలియదు. మేమిద్దరం ఒకేసారి ప్రెగ్నెన్సీ ధరించడం యాధృచ్చికంగా జరిగింది.

నిజానికి పిల్లలను కనడమనేది అప్పట్లో ఆమెకి ఇష్టం ఉండేది కాదు. అలాంటి మంజుల ఆ తరువాత ఒక కూతురుకు జన్మనిచ్చింది. ఒక తల్లిగా ఆమె ఇప్పుడు ఎంతో సంతృప్తికరంగా ఉండటం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది.

పెళ్లి తరువాత సినిమాలకి దూరం కావడం వలన నేను ఎప్పుడూ బాధపడింది లేదు. మహేశ్ కంటే నాకు సినిమాలు ఎక్కువ కాదు. ఒక వైపున మహేశ్ పై వర్క్ పరమైన ఒత్తిడి లేకుండా చూసుకుంటూ, మరో వైపున పిల్లలకి సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నాను. ఫ్యామిలీ పరమైన పనులతో నేను ఎప్పుడూ బిజీనే. మళ్లీ తెరపై కనిపించాలనే ఆలోచనైతే లేదు. ఇకపై నేను చేయవలసింది కూడా కుటుంబ సంబంధమైన పనులపై పూర్తి దృష్టి పెట్టడమే" అంటూ చెప్పుకొచ్చారు.