Begin typing your search above and press return to search.

నమ్రత మల్టీ స్టారర్.. ఏంటా ప్రాజెక్ట్?

By:  Tupaki Desk   |   11 Feb 2017 1:27 PM GMT
నమ్రత మల్టీ స్టారర్.. ఏంటా ప్రాజెక్ట్?
X
బాలీవుడ్ హీరోయిన్ అయిన నమ్రతా శిరోద్కర్.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును 2005లో వివాహం చేసుకున్నాక.. సినిమా రంగానికి పూర్తిగా దూరమైపోయింది. మహేష్ భార్యగా.. ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతలు పర్ఫెక్ట్ గా నెరవేరుస్తోంది నమ్రత.

గతంలో మిస్ ఇండియా కూడా అయిన నమ్రత.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అని చెప్పేయడం సెన్సేషన్ అవుతోంది. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. త్వరలో ఓ మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్నానంటూ అసలు విషయం చెప్పేసింది. 2005లో చివరగా నమ్రత నటించిన హాలీవుడ్ మూవీ బ్రైడ్ అండ్ ప్రిజుడిస్ రిలీజ్ అయింది. అదే ఏడాది మహేష్ ను వివాహమాడిన ఈమె.. మళ్లీ 12 ఏళ్ల తర్వాత కొత్త సినిమా కబురు చెప్పింది.

అయితే.. ఇంతకీ నమ్రత నటించబోయే మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ఏదబ్బా అనే చర్చ విపరీతంగా సాగుతోంది. అటు హిందీలో అయితే.. మల్టీ స్టారర్ లు తెగ వచ్చేస్తుంటాయి. ఇటు తెలుగులో కూడా ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది. పైగా ఇప్పుడు పలు మల్టీ స్టారర్ మూవీల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మల్టీస్టారర్ లో నటిస్తున్నానని చెప్పి.. పెద్ద సస్పెన్స్ నే క్రియేట్ చేసింది మహేష్ వైఫ్ నమ్రత.