Begin typing your search above and press return to search.
ఏపీ సర్కారుకు 'నాని' దెబ్బలు... ఈ పేరులోనే 'ఫైర్'
By: Tupaki Desk | 25 Dec 2021 11:16 AM ISTఏపీలో చాలామంది ముద్దు పేరు ‘నాని’. అల్లారుముద్దుగా చూసుకునే పిల్లలను చాలామంది పేరు పెట్టి పిలవలేక ‘నాని’ అని వ్యవహరిస్తుంటారు. చిత్రంగా ఏపీ రాజకీయాల్లోనూ నానిలు ఎక్కువే. కొడాలి నాని, పేర్ని నాని ప్రభుత్వంలో మంత్రులుగా సాగుతున్నారు.మంత్రులుగా పేర్ని, కొడాలి ఎంత దూకుడుగా ఉంటారో అందరికీ తెలిసిందే. సర్కారు విధానాలను గట్టిగా సమర్థించడంలో గానీ..
ప్రతిపక్షాలను ఎండగట్ట్టడంలో గానీ ఇద్దరు నాని లు ఎలా వ్యవహరిస్తారో అదరూ చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా టీడీపీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశను కొడాలి నాని తీవ్రంగా విమర్శిస్తుంటారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను పేర్ని నాని దునుమాడుతుంటాడు. ఇక్కడ అధికార పార్టీ వైసీపీ వ్యూహం గురించి చెప్పుకోవాలి.
కొడాలిని తన సామాజిక వర్గమైన చంద్రబాబు మీదకు, పేర్నిని ఆయన సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ పైకి ప్రయోగిస్తోంది. వైసీపీ రాజకీయాల పరంగా చూస్తే ఈ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు. ఇక ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల నాని. ఈయనా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రాజకీయ కుటుంబం
నుంచి వచ్చిన ఆళ్ల వార్తల్లో పెద్దగా ఉండరు. ప్రస్తుతానికి కొడాలి, పేర్నినే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
వీరు కాక మరో ఇద్దరు నానిలు
పైన చెప్పుకొన్న ఇద్దరు నానిలు కాక.. ఏపీ రాజకీయాల్లో మరో ఇద్దరు నానిలు ఉన్నారు. వారే, విజయవాడ ఎంపీ కేశినేని నాని. టీడీపీ నుంచి కీలక నేతగా పార్లమెంటులో గళం వినిపిస్తున్నారు. అంతేకాదు.. పార్టీలోనూ కేశినేని నాని రెబలే. పార్టీలో తనకు ప్రత్యేక స్థానం కోసం పోరాడుతుంటారు. కుమార్తెను కూడా రాజకీయాల్లోకి తెచ్చారు.
కార్పొరేటర్ గానూ గెలిపించుకున్నారు. ఇటీవలే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలూ తనకే దక్కాయి. బుద్ధా వెంకన్న, షేక్ నాగుల్ మీరా వంటి నాయకులను కాదని చంద్రబాబు ఈయనకు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన పులివర్తి నాని కూడా ఏపీలో ఓ స్థాయి నాయకుడే. జిల్లా పార్టీ అధ్యక్షుడిగానూ పని చేశారు.
ఈ నాని ఇలా..
తాజాగా నేచురల్ స్టార్ నాని (గంగా నవీన్) పేరు వార్తల్లో నిలిచింది. తన సినిమా శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్ సందర్భంగా హీరో నాని కీలక వ్యాఖ్యలు చేసి హైలైట్ అయ్యారు. ఏపీలో టిక్కెట్ రేట్ల తగ్గింపు సరికాదని, థియేటర్ల వారు కంటే పక్కనున్న కిరాణం దుకాణం వారు ఎక్కువ సంపాదిస్తున్నారంటూ నాని చేసిన కామెంట్స్ ఆలోచింపజేశాయి.
అన్ని వర్గాల నుంచి దీనిక స్పందన వచ్చింది. అసలే సంక్రాంతి ముంగిట.. అందులోనూ సినిమా అంటే పిచ్చిగా ప్రేమించే ఏపీ వాసులను నాని వ్యాఖ్యలు ఆలోచింపజేశాయి. అటు ఏపీలో వరుసగా సినిమా హాళ్లపై సోదాలు కొనసాగుతున్నాయి. జగన్ ప్రభుత్వం నేరుగా సినిమా వాళ్లతో తలపడుతుందేమిటా? అని వ్యాఖ్యలు
వస్తున్నాయి.
స్పందించని ‘నాని’ మంత్రులు
సినీ హీరో నాని వ్యాఖ్యలపై మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని నుంచి ఎలాంటి వ్యాఖ్యలు రాలేదు. కొడాలికి ఎటువంటి సంబంధం లేకున్నా.. ఇక్కడ పేర్ని స్పందన ముఖ్యం. ఎందుకంటే సమాచార శాఖ, ప్రజా సంబంధాల మంత్రిగా పలు సందర్భాల్లో పేర్ని నానినే సినిమా ప్రముఖులతో చర్చలు జరిపారు. దీనికితోడు ఏపీ మంత్రుల జాబితాను ఇంటర్నెట్లో చూస్తే సినిమాటోగ్రఫీ మంత్రి అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. తెలంగాణకు వస్తే తలసాని శ్రీనివాస యాదవ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చూస్తున్నారు.
సినిమా వారు నేరుగా ఏ విషయమైనా ఆయననే కలుస్తుంటారు. కొంచెం పెద్ద స్టార్లు అయితే మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్తుంటారు. కానీ, ఏపీలో మాత్రం పేర్నినానినే డీల్ చేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున వంటి పెద్ద స్టార్లు గతంలో సీఎం జగన్ ను కలిశారు. మిగతావారు, దర్శకులు, నిర్మాతలు మాత్రం పేర్ని నానిని కలుస్తుంటారు.
ఈ విషయం పక్కనపెడితే హీరో నాని కామెంట్స్ పై సంబంధిత శాఖ మంత్రిగా భావించే పేర్ని నాని కానీ, హీరో నాని సొంత జిల్లా (క్రష్ణా)కు చెందిన మంత్రి కొడాలి గాని స్పందించలేదు. ఇప్పటివరకు మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ మాత్రమే మాట్లాడారు. ఇదండీ ఏపీలో నానిల కథ.