Begin typing your search above and press return to search.
‘నల్లమల’ ఫస్ట్ లుక్ రిలీజ్
By: Tupaki Desk | 1 Jan 2021 1:10 PM ISTఅడవుల ధ్వంసం.. గిరిజన జీవితాల నేపథ్యంలో ఇప్పటి వరకూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ.. వాటికి భిన్నంగా ప్రస్తుతం నల్లమల అడవిచుట్టూ జరిగిన, జరుగుతున్న చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ, అవినీతి ఒప్పందాలను వివరిస్తూ సాగే కథతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అదే ‘నల్లమల’. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా, భవిష్యత్ తరాల కోసం పోరాటం సాగించిన ఒక వీరుడి కథే ఈ చిత్రం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌ను దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేశారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమానే అయినా.. ఇందులో లవ్, ఎమోషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా జోడిస్తూ తెరకెక్కుతోందీ చిత్రం. కథే ప్రధాన బలంగా రవి చరణ్ దర్శకత్వంలో వస్తోన్న ‘నల్లమల’ చిత్రంలో టాలెంటెడ్ నటుడు అమిత్ తివారీ హీరోగా, భానుశ్రీ హీరోయిన్ గా నటించింది. ఇతర కీలక పాత్రల్లో నటులు నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్ తోపాటు చలాకీ చంటి, ముక్కు అవినాశ్ నటిస్తున్నారు. ఆర్.ఎమ్. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘నల్లమల అడవి నేపథ్యంలో రకరకాల కోణాల్లో ఇప్పటి వరకు అనేక చిత్రాలొచ్చాయి. వాటికి భిన్నంగా ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాలను ఆవిష్కరిస్తూ సాగే కథ ఇది. చీకటి ఒప్పందాలకు వ్యతిరేకంగా ఒక వీరుడు చేసిన పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించనున్నాం. ప్రేమ, వినోదం, భావోద్వేగాలు అన్నీ పుష్కలంగా ఉన్న చిత్రమిది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకు సంగీతం పి.ఆర్ అందిస్తున్నారు.