Begin typing your search above and press return to search.

నక్షత్రానికి ట్రైలర్ దెబ్బేసిందా!!

By:  Tupaki Desk   |   10 July 2017 10:36 AM GMT
నక్షత్రానికి ట్రైలర్ దెబ్బేసిందా!!
X
టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్ ఆసక్తి కలిగిస్తున్న చిత్రాల్లో ఒకటి నక్షత్రం. క్రియేటివ్ డైరెక్టర్ అని ఆడియన్స్ పిలుచుకునే కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందడమే అసలు కారణం. అయితే.. రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసిన తర్వాత మూవీపై ఉన్న హోప్స్ అన్నీ ఆవిరయ్యాయనే టాక్ వినిపిస్తోంది.

కృష్ణవంశీ ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నా.. ఈ చిత్రంపై ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. సందీప్ కిషన్- రెజీనా హీరో హీరోయిన్లుగా ప్రారంభించిన ఈ చిత్రంలోకి.. సాయిధరం తేజ్- ప్రగ్యా జైస్వాల్ లను తీసుకురావడం.. ప్రకాష్ రాజ్ తో లీడ్ రోల్ చేయించడం.. శ్రియతో ఐటెం సాంగ్ చేయించడంతో.. నక్షత్రంతో కృష్ణవంశీ బౌన్స్ బ్యాక్ అవుతాడని అంతా అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే మూవీని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు వచ్చారు. హోల్ సేల్ డీల్స్ పై ఒకట్రెండు డిస్కషన్స్ జరిగినట్లు టాక్. అయితే.. రీసెంట్ గా నక్షత్రం ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మొత్తం సీన్ అంతా మారిపోయిందట. హీరోయిన్ల అందాలను ప్రొజెక్ట్ చేయడంలో తప్ప ఎక్కడా కృష్ణవంశీ మార్క్ కనిపించలేదని భావిస్తున్నారట బయ్యర్స్.

అలాగే ఆడియన్స్ లో ఆసక్తిని కలిగించడంలో కూడా కృష్ణవంశీ ఫెయిల్ అయ్యాడు. ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి కాని ఈ చిత్రానికి.. ఇలా సౌండ్ హంగామా ఉండే ట్రైలర్ ను కట్ చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నారట. మరి ఈ బ్యాడ్ టాక్ నుంచి నక్షత్రాన్ని బైటకు తెచ్చేందుకు కృష్ణవంశీ ఏం చేయనున్నాడో చూడాలి.