Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: యునిఫామ్ లేని నక్షత్రం

By:  Tupaki Desk   |   7 May 2017 6:43 AM GMT
టీజర్ టాక్: యునిఫామ్ లేని నక్షత్రం
X

పోలీస్ అంటే యునిఫాం వేసుకున్న సిటిజన్.. సిటిజన్ అంటే యునిఫామ్ లేని పోలీస్.. అనే నానుడి ఎప్పటినుండో చలామణిలో ఉంది. ఇప్పుడు అదే లైన్ తీసుకుని క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ ''నక్షత్రం'' సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను చాన్నాళ్ళ డిలే తరువాత ఇవాళే రిలీజ్ చేశారు. పదండి ఎలా ఉందో చూద్దాం.

హీరో సందీప్ కిషన్ యునిఫామ్ వేసుకోకుండా పోలీసులా సాయం చేయాలని అనుకుంటాడు. ఇక పోలీస్ యునిఫామ్ వేసుకుని అదరగొట్టేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. మొత్తంగా ఛేజులూ.. యాక్షన్ ఎపిసోడ్లు.. మధ్యలో రెజీనా అండ్ ప్రగ్యా జైస్వాల్ తాలూకు గ్లామర్ తళుకులు.. అబ్బో అలా అలా ఆవేశంగా నడిపేశాడు కెవి. సినిమాలో మ్యాటర్ ఏముందనేది ఈ టీజర్ చూస్తే చెప్పలేం కాని.. అసలు నిమిషం కూడా బ్రేక్ లేని ఒక కాప్ అండ్ క్రైమ్ డ్రామాగా సినిమాను తీసుంటాడని అనుకోవచ్చు. ఇకపోతే యంగ్ హీరో తనీష్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు.

ఎప్పటినుండో రిలీజ్ కు నోచుకోని ఈ 'నక్షత్రం' టీజర్లోని ఆఖరి సన్నివేశంలో సందీప్ కిషన్ కూర్చుని మాట్లాడే సీన్ చూస్తే మాత్రం.. ఖడ్గం సినిమాలో ప్రకాష్‌ రాజ్ పోలీస్ స్టేషన్లో క్రింద కూర్చుని మాట్లాడిన సీన్ గుర్తొచ్చింది. మీరేమంటారు??