Begin typing your search above and press return to search.

'ధృవ' నక్షత్రం చేతులపై లోగో లాంఛ్

By:  Tupaki Desk   |   8 Oct 2016 8:00 AM GMT
ధృవ నక్షత్రం చేతులపై లోగో లాంఛ్
X
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇప్పుడు నక్షత్రం మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ - రెజీనా జంటగా నక్షత్రం మూవీ రూపొందుతుండగా.. ఈ చిత్రం మెగా హీరో సాయి ధరం తేజ్.. ప్రగ్యా జైస్వాల్ లు గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పుడీ మూవీ లోగో లుక్ లాంఛ్ అయింది.

కృష్ణవంశీ తనకెంతో ఇష్టమైన రామ్ చరణ్ చేతులమీదుగా నక్షత్రం లోగోను లాంఛ్ చేయించాడు. నక్షత్రం సెట్స్ కు రామ్ చరణ్ వచ్చినప్పటి నుంచి దాన్ని ఓ వీడియోగా మలిచి షేర్ చేశారు యూనిట్. చరణ్ వచ్చి కారు దిగడం.. తర్వాత తన కార్వాన్ లోకి వెళ్లడం.. తర్వాత కెమేరా లోపలికి అడుగు పెట్టడం.. తన ఫేస్ బుక్ నోటిఫికేషన్ గా నక్షత్రం లోగో లుక్ ని లాంఛ్ చేయడం.. అంతా సీక్వెన్స్ లా తయారు చేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకుంటే.. లోగో.. దానికి వెనక ఇచ్చిన మ్యూజిక్ సూపర్బ్ గా ఉంది.

ధృవ హీరో చేతుల మీదుగానే నక్షత్రం లాంఛ్ చేయడం వెనక.. కృష్ణవంశీ ప్రదర్శించే కృతజ్ఞత ఉంటుంది. ఈ క్రియేటివ్ డైరెక్టర్ ని ఇండస్ట్రీ అంతా పక్కన పెట్టేసిన టైమ్ లో.. తిరిగి బౌన్స్ బ్యాక్ అయేందుకు గాను.. గోవిందుడు అందరివాడేలే చిత్రం చేశాడు చెర్రీ. 40 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించే సినిమా తీసి.. తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కారణం అయిన రామ్ చరణ్ అంటే.. కృష్ణవంశీకి చాలా ఇష్టం ప్లస్ ప్రేమ. ఈ నక్షత్రానికి సంబంధించినంతవరకూ అన్నీ రామ్ చరణ్ చేతుల మీదుగా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/