Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్‌: నక్షత్రం ట్యాగ్ అలా కట్టుకున్నాడు

By:  Tupaki Desk   |   10 Oct 2016 7:44 AM GMT
ఫస్ట్ లుక్‌: నక్షత్రం ట్యాగ్ అలా కట్టుకున్నాడు
X
సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ తనలోని జ్యూస్ ఇంకా అయిపోలేదని ప్రూవ్ చేసే పనిలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఆయన సందీప్ కిషన్ తో తీస్తున్న ''నక్షత్రం'' సినిమా కోసం.. ముందుగా ఒక ప్రత్యేక పాత్ర కోసం సాయిధరమ్ తేజ్ ను తీసుకున్నాడు. ఇప్పుడేమో రామ్ చరణ్ తో ప్రమోషన్లు చేయిస్తున్నాడు. ఆ క్రమంలో భాగంగా ఇవాళ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు.

మామూలుగా అయితే పోలీసుల క్యాప్ మీద ఎంబ్లమ్ ముద్ర ఒక బ్యాడ్జ్ రూపంలో ఉంటుంది. అలాంటి బ్యాడ్జ్ డ్రస్సుకు కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు కృష్ణవంశీ మాత్రం చేతికి ఒక తాయత్తు తాడు కట్టించి.. అక్కడ తాయత్తు బదులు బ్యాడ్జ్ ను పెట్టాడు. అంటే లా అండ్ ఆర్డర్ గురించి ఈయన హీరో ఆ రేంజులో కేర్ చేస్తాడని చెబుతున్నాడు. అయితే ఆ ట్యాగ్ కట్టుకున్న చెయ్యి.. సందీప్ కిషన్ దా? లేకపోతే సాయిధరమ్ తేజ్ దా? అనేదే అసలు ప్రశ్న ఇక్కడ.

ఈ సినిమాలో సందీప్ కిషన్ రోల్ ఒకెత్తయితే.. సాయిధరమ్ రోల్ మరో రేంజ్ అని తెలుస్తోంది. సముద్రం సినిమాలో శ్రీహరి రోల్ తరహాలో సాయిధరమ్ రోల్ ఉంటుందట. ఇక డస్కీ సైరన్ రెజీనా సందీప్ ను రొమాన్స్ చేస్తుంటే.. కంచె గాళ్‌ ప్రగ్యా జైస్వాల్ సాయిధరమ్ సరసన మరో ఇనస్పెక్టర్ గా మెరుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/