Begin typing your search above and press return to search.
రామ్ కోసం కూడా అదే ఫార్ములానా?
By: Tupaki Desk | 2 Dec 2017 5:00 AM ISTదిల్‌రాజు కాంపౌండ్ ఈమధ్య కొత్త కొత్త కాంబినేషన్లని సెట్ చేస్తోంది. అందులో భాగంగా రామ్ - త్రినాథరావు నక్కిన కాంబోలో ఓ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన వెలువడింది. అయితే ఈ సినిమాకోసం దర్శకుడు త్రినాథరావు తనకి అచ్చొచ్చిన ఫార్ములాని ఎంచుకొన్నాడని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. త్రినాథరావు ఇదివరకు `సినిమా చూపిస్త మామా` - `నేను లోకల్` సినిమాల్ని తీశాడు. ఆ రెండు సినిమాలకీ మామాఅల్లుళ్ల మధ్య డ్రామానే హైలెట్. ఆ రెండూ కూడా మంచి హిట్లయ్యాయి. అందుకే ఇప్పుడు రామ్ తో తీస్తున్న సినిమా కథకీ మామా అల్లుళ్ల టచ్ ఇస్తున్నారని తెలుస్తోంది.
మామా అల్లుళ్ల మధ్య వార్ అనేది ఎప్పుడూ మాస్‌ని అలరించే అంశమే. అది పక్కాగా సెట్ అయితే మాత్రం సినిమా హిట్టు ఖాయమని చాలా చిత్రాలు నిరూపించాయి. మరి రామ్ అల్లుడి పాత్రలో ఎలా సందడి చేస్తాడో చూడాలి. త్రినాథరావు నక్కిన చిత్రాలకి ప్రసన్నకుమార్ అనే రచయిత కథల్ని అందిస్తుంటాడు. అతను మాస్ టచ్ తో కథల్ని రాయడంలో సిద్ధహస్తుడు. రామ్ కూడా మాస్ కథలతో సరైన హిట్టు అందుకుని చాలా కాలమైంది. అందుకే ఆయన ఈ సినిమా తనకి అన్ని రకాలుగా వర్కవుట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నట్టు తెలిసింది.