Begin typing your search above and press return to search.

తెలుగు పాటలు.. లైఫ్ కి సరిపడే అనుభూతులు

By:  Tupaki Desk   |   28 Dec 2016 7:30 PM GMT
తెలుగు పాటలు.. లైఫ్ కి సరిపడే అనుభూతులు
X
ఓ సింగర్ అనేక పాటలు పాడాల్సి వస్తుంది. అందులో హిట్స్.. ఫ్లాప్స్ కూడా ఉంటాయి. కానీ 100 పర్సెంట్ సక్సెస్ రేట్ అంటే చిన్న విషయం కాదు. మొత్తం కెరీర్ కి కాకపోయినా.. నకాష్ అజీజ్ టాలీవుడ్ లో ఈ ఫీట్ సాధించగలిగాడు. లీడర్ లో వందేమాతరం.. సర్దార్ గబ్బర్ సింగ్ లో తోబ తోబ.. సరైనోడు బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ సింగర్ ఇప్పటివరకూ మొత్తం 42 పాటలు పాడేశాడు. వీటిలో చాలా వరకూ హిట్స్ కాగా.. ఇప్పుడు మెగాస్టార్ ల్యాండ్ మార్క్ మూవీ ఖైదీ నంబర్ 150లో కూడా ఓ మాంచి బీట్ ఉన్న పాట పాడనని అంటున్నాడు.

'నేను హిందీలో చాలానే సాంగ్స్ పాడాను. అందులో ఎనర్జీ అంతా ఉపయోగించి పాడినవి కూడా ఉన్నాయి. కానీ తెలుగు విషయానికి వచ్చేసరికి అంతా మారిపోతుంది. ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉంటాయంటే.. ఓ లైఫ్ కి సరిపడే అనుభూతులను ఇస్తాయి. ముఖ్యంగా నేను ఇక్కడ మాస్ సాంగ్స్ పాడుతున్నాను. అన్నీ సక్సెస్ సాధించడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడి పాటలు నాలోని అంతర్గత శక్తిని బయటకు తెస్తున్నాయి' అంటున్నాడు నకాష్.

సహజంగా తాను చాలా సిగ్గరి అయినా.. ఒకసారి స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత.. ఎదురుగా ఉన్న వ్యక్తులను చూశాక అన్నీ మర్చిపోయి కేవలం మ్యూజిక్ ని మాత్రమే మైండ్ లో పెట్టుకుంటా అంటున్న నకాష్ అజీజ్.. స్టేజ్ పెర్ఫామెన్స్ లను బాగా ఎంజాయ్ చేస్తానంటున్నాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/