Begin typing your search above and press return to search.

బ్యాంకాక్ లో నైరా.. సరదాగా కాసేపు

By:  Tupaki Desk   |   4 Dec 2016 11:00 AM IST
బ్యాంకాక్ లో నైరా.. సరదాగా కాసేపు
X
నైరా బెనర్జీ అంటే టక్కుమని మనోళ్లకు గుర్తు రాదేమో కానీ.. మధురిమ అంటే మాత్రం టక్కుమని గుర్తు తెచ్చేసుకోగలరు. టాలీవుడ్ లో సక్సెస్ అయిపోయి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినోళ్లు చాలామందే ఉంటారు కానీ.. ఈమె ఇక్కడ సక్సెస్ కాకపోయినా బాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ పట్టేస్తోంది. రీసెంట్ గా వచ్చిన అజార్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నైరా బెనర్జీ.. ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్ కోసం బ్యాంకాక్ లో హంగామా చేస్తోంది.

పట్టాయా బీచ్ లలో అమ్మడు చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. టాలీవుడ్ లో ఏమీ పద్ధతైన పాత్రలు చేసేసిందని కాదు కానీ.. బాలీవుడ్ కి వెళ్లాక అక్కడ ట్రెండ్ ని బాగా వంట పట్టించుకున్నట్లుగా ఉంది నైరా. అందుకే అక్కడి వాతావరణానికి అనుకూలంగా తనను తాను కంప్లీట్ గా మేకోవర్ చేసేసుకుంది. పట్టాయాలో బికినీలో ఈ భామ చేసిన రచ్చ చూస్తే కెవ్వు కేక అనాల్సిందే. బుల్లిబుల్లి డ్రెస్సులేసుకుని.. అందాల ఆరబోతలో బాలీవుడ్ టాప్ భామలకు పోటీ ఇచ్చేస్తోంది కూడా.

ఇక్కడ సరాదాగా కాసేపు లాంటి మూవీస్ మినహా.. మిగతా అన్నీ చిన్నా చితకా సినిమాలతో టాలీవుడ్ జనాలు సరిపెట్టేయడం ఎంత తప్పో ప్రూవ్ చేస్తున్నట్లుగా ఉంది నైరా బెనర్జీ వాలకం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/