Begin typing your search above and press return to search.

పెద‌వి ముద్దుల‌తో ఆవిరులు పుట్టిస్తున్న‌ డీ కంపెనీ బ్యూటీ

By:  Tupaki Desk   |   10 Feb 2021 3:30 AM GMT
పెద‌వి ముద్దుల‌తో ఆవిరులు పుట్టిస్తున్న‌ డీ కంపెనీ బ్యూటీ
X
ఆర్జీవీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `వంగవీటి` సినిమాలో రత్నకుమారి పాత్ర‌లో న‌టించి మెప్పించింది నైనా గంగూలీ. ఆరంగేట్ర‌మే ప్రతిభావ‌నిగా ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో పెద్ద కెరీర్ నే ఆశించినా ఎందుక‌నో ఆశించిన‌న్ని ఆఫ‌ర్లు అయితే రాలేదు. ఆ క్ర‌మంలోనే మ‌ళ్లీ బ్యూటిఫుల్ అనే సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చారు ఆర్జీవీ. ఆ మూవీలో వేడెక్కించే న‌ట‌న‌తో అగ్గి రాజేసింది. నైనాను రంగీలా రేంజులో ప్ర‌మోట్ చేసారు ఆర్జీవీ.

ప్ర‌స్తుతానికి సోష‌ల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది నైనా. బ్యూటిఫుల్ ని మించి `డేంజరస్` అంటూ లెస్బియన్ కాన్సెప్ట్ ఉన్న‌ సినిమాతో బ‌రిలో దిగింది ఈ భామ. ప్ర‌చారం ఆ రేంజులోనే సాగిస్తోంది.

ఆర్జీవీ డీ కంపెనీ ద్వారా ప‌రిచ‌య‌మైంది కాబ‌ట్టి నైనాకు కావాల్సినంత పబ్లిసిటీనిస్తోంది టీమ్. ఇంత‌కుముందు ఓ ప‌బ్లిక్ ఈవెంట్లో నైనా కాళ్ల‌పై ప‌డిన ఆర్జీవీ బోలెడంత ఫ‌న్ క్రియేట్ చేసి ప్ర‌చారాన్ని వేడెక్కించారు. ఇక తాజాగా పెద‌వి ముద్దుల‌తో వేడెక్కిస్తున్న ఓ ఫోటోని షేర్ చేసిన నైనా గంగూలీ దీనికి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ఇచ్చింది. ఆర్జీవీ డీ కంపెనీ.. క‌మింగ్ సూన్! అంటూ వ్యాఖ్య‌‌ను ఓడించింది. ఈ సినిమాతోపాటు `జోహార్‌` అనే వేరొక చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించనుంది. టాలీవుడ్ లో హాట్‌ టాపిక్ గా మారిన నైనా వ‌రుస ఫోటోషూట్లు ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి.