Begin typing your search above and press return to search.

రెండు ల‌క్ష‌ల‌కే అంత‌గా చెల‌రేగిన ఆమె ఎవ‌రు?

By:  Tupaki Desk   |   2 July 2020 8:30 AM IST
రెండు ల‌క్ష‌ల‌కే అంత‌గా చెల‌రేగిన ఆమె ఎవ‌రు?
X
ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసినా సంథింగ్ స్పెషాలిటీ ఉంటుంది. ఆయ‌న ఫ‌క్తు శృంగారం ఆధారంగా సినిమాలు తీసినా లాభాలు తెస్తున్నారు. ఇంత‌కుముందు జీఎస్టీ మూవీ వ‌ల్ల నిర్మాత‌కు న‌ష్టం రాలేదన్న టాక్ వినిపించింది. క్రిటిక్స్ వ‌ల్ల విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నా.. అత‌డు చేసేది చేయ‌క మానడు. ఈసారి ఆర్జీవీ తాజా ప్ర‌య‌త్నం నేక్డ్. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఈ సినిమా అంతా పూర్తి నేక్డ్ గానే ఉంద‌న్న టాక్ ఉంది.

ఇక ఇందులో న‌టించిన తెలుగ‌మ్మాయి శ్రీ రాపాక అందాల ఆర‌బోత‌తో దుమార‌మే రేపింది. స‌న్నీలియోన్ కి అయినా మ‌తి చెడేలా న‌టించింది అంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. థై సొగ‌సులు.. సొగ‌సైన కాలి అందాలు.. షార్ట్ తొల‌గిస్తూ.. బిగువుల సొగ‌సును ఎర వేస్తూ.. ఇలా మూవీ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే సీన్స్ ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ మూవీ హిట్టు అంట‌. ఇంత‌కీ ఈ సినిమా బ‌డ్జెట్ ఎంత‌? టోట‌ల్ ఖ‌ర్చు ఎంత? లాభం ఎంత‌? అన్న‌ది ప్ర‌శ్నిస్తే.. ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిశాయి.

కేవ‌లం ఆరు ల‌క్ష‌ల బ‌డ్జెట్ తో సినిమాని తీసి మ‌రో ఆరు ల‌క్ష‌లు ప్ర‌క‌ట‌న‌ల‌కు ఖ‌ర్చు చేసార‌ట‌. ఇక ఇందులో న‌టించిన శ్రీ రాపాక‌కు 2ల‌క్ష‌ల పారితోషికం మాత్ర‌మే చెల్లించార‌ట‌. అయితే శ్రేయాస్ ఇటి ఆన్ లైన్ థియేట‌ర్ లో ఈ మూవీని రూ.200 టిక్కెట్టుకి చెల్లించి 35 వేల మంది వీక్షిస్తే ఆ మేర‌కు లాభాలు రావ‌డంతో అందులో వాటా కూడా ఇచ్చార‌ట స‌ద‌రు హీరోయిన్ కి.

శ్రీ రాపాక ఓ ఇంట‌ర్వ్యూలో ముచ్చ‌టిస్తూ.. ఆర్జీవీకే ఈ క్రెడిట్ అంతా అని తెలిపారు. ఇక ఈ అవ‌కాశం అసోసియేట్ డైరెక్ట‌ర్ హ‌రీష్ వ‌ల్ల ద‌క్కింద‌ని వెల్ల‌డించారు. ఇక ఆడిష‌న్స్ లో ప‌లువురు అమ్మాయిల్ని ప‌రిశీలించి చివ‌రికి త‌న‌ని ఎంపిక చేశార‌ట‌. 5.6 అడుగుల తన ఎత్తు ఈ అవ‌కాశం రావ‌డానికి కార‌ణ‌మ‌ని వెల్ల‌డించింది. ఇక శ్రీ రాపాక ఎవ‌రు? అన్న‌ది ఆరా తీస్తే... ప‌శ్చిమ గోదావ‌రి త‌న స్వ‌స్థ‌లం. ఇండ‌స్ట్రీలో కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా .. న‌టిగా సుప‌రిచితం. చాలా కాలం చాలా ర‌కాల‌ అనుభవాల‌ త‌ర్వాత న‌ట‌న‌లో రాటు దేలుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఆమె ఎవ‌రు? అంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆరాలు తీయ‌డం చూస్తుంటే ఈ అమ్మ‌డి కెరీర్ కి ఇక డోఖా లేద‌ని అర్థ‌మ‌వుతోంది.