Begin typing your search above and press return to search.

సుశాంత్‌ కేసు దారి తప్పుతుంది : నగ్మ

By:  Tupaki Desk   |   18 Sept 2020 6:40 PM IST
సుశాంత్‌ కేసు దారి తప్పుతుంది : నగ్మ
X
సుశాంత్‌ మృతికి కారణం ఎవరు.. అతడి మృతిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సింది పోయి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ సీనియర్‌ హీరోయిన్‌.. కాంగ్రెస్‌ నాయకురాలు నగ్మ విమర్శలు. కేసు మొత్తం పక్క దోవ పట్టి ఇప్పుడు అంతా కూడా డ్రగ్స్‌ కు సంబంధించిన విషయంపైనే చర్చ జరుగుతుందని నగ్మ పేర్కొంది. సుశాంత్‌ కేసులో ఉన్న పెద్ద వారిని తప్పించేందుకు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారేమో అంటూ నగ్న అనుమానాలు వ్యక్తం చేసింది.

నగ్మ మాట్లాడుతూ ఈ కేసులోకి అనూహ్యంగా డ్రగ్స్‌ విషయాన్ని తీసుకు వచ్చి అసలు కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నేతలు ఎందుకు డ్రగ్స్‌ కేసు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దేశం మొత్తం కూడా సుశాంత్‌ కేసులో నిజా నిజాలు తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారంది. ఇటీవల బీజేపీ నాయకురాలు జయప్రద డ్రగ్స్‌ విషయమై ఇప్పుడు చర్చ జరగాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నగ్మ ఈ కౌంటర్‌ ఇచ్చింది. బీజేపీ నేతలకు డ్రగ్స్‌ కేసుపై ఉన్నంత శ్రద్ద సుశాంత్‌ మృతి కేసుపై ఎందుకు లేదు అంటూ నగ్మ ప్రశ్నించింది. మరి నగ్మ వ్యాఖ్యలకు బీజేపీ నాయకుల కౌంటర్‌ ఎలా ఉంటుందో చూడాలి.