Begin typing your search above and press return to search.

నాగినీడు మాటకు సూపర్ స్టార్ కృష్ణ ఇంటిని మార్చేశారట

By:  Tupaki Desk   |   27 Feb 2023 3:00 PM GMT
నాగినీడు మాటకు సూపర్ స్టార్ కృష్ణ ఇంటిని మార్చేశారట
X
నటుడు నాగినీడును చూసినంతనే మన ఇళ్లల్లో అలాంటి క్యారెక్టర్ ఒకటి తప్పక ఉండేలా అనిపిస్తారు. సినిమాల్లో ఆయన మాట.. ఆయన ముఖకవళికలు అన్నీ ఇంట్లో ఉండే పెద్దోళ్లను గుర్తుకు తెచ్చేలా ఉంటాయి. ఎడిటింగ్ ల్యాబ్ టెక్నిషియన్ కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన.. అనూహ్యంగా నటుడిగా మారటం.. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకోవటం తెలిసిందే.

అలాంటి ఆయనకు సంబంధించిన కొత్త కోణం ఒకటి తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూతో బయటకు వచ్చింది. ఆయనకు వాస్తు చెప్పటం అలవాటు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు.

దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఇంటి విషయంలో తాను చెప్పిన మార్పుల్ని పాటించిన వైనాన్ని వెల్లడించారు. ఆయన మాటల్లోనే చెబితే.. ''ఒకరోజు కృష్ణను కలిసేందుకు ఆఫీసుకు వెళ్లాను. ఆయనతో మాట్లాడిన తర్వాత పక్క రూమ్ కు వెళ్లా. ఆ సందర్భంగా కృష్ణగారు అనుసరించే విధానం తెలిసింది. పక్క రూంలోకి వచ్చి వెనక్కి నుంచి వెళ్లిపోతారు. అది సరైన విధానం కాదు.

అదే విషయాన్ని కృష్ణ దగ్గర ఉండే మల్లయ్యకు చెబితే.. బాబ్బాబూ ఆ విషయం ఆయనకు చెప్పండన్నాడు. నైరుతిలో బెడ్రూం.. ఆగ్రేయంలో కిచెన్.. వాయువ్యంలోపిల్లల బెడ్రూం.. ఈశాన్యంలో హాల్ ఉందనుకుందాం. మీరు పొద్దున్నే బయటకు వెళ్లేటప్పుడు మీ భార్య మీరు పనికి వెళుతున్న విషయాన్ని గుర్తిస్తుంది. పిల్లలు బడికి వెళ్లారా? అన్న విషయాన్ని చూసే అవకాశం ఉంటుంది.

ఆఫీసుకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత పిల్లలు వచ్చారా? అన్నది కనిపించటంతో పాటు భార్య కూడా కనిపిస్తారు. ఆ తర్వాత మీరు మీ రూంకు వెళతాడు. అదే మీరు వెనుక నుంచి వచ్చి వెనక నుంచి వెళ్లిపోతే ఎలా? అందుకే ముందు నుంచి వచ్చి అందరిని చూసుకుంటూ ముందు నుంచి వెళ్లండి. ఇదే వాస్తు'' అన్న విషయాన్నికృష్ణగారికి చెప్పాను.

విషయాన్ని శాస్త్రం అన్న పేరుతో కాకుండా లాజిక్ తో చెబితే ఎవరైనా కనెక్టు అవుతారు. ఆ తర్వాత రెండురోజుల తర్వాత నుంచి నా మాటల్ని కృష్ణగారు పాటించిన విషయాన్ని మల్లయ్య ఫోన్ చేసి మరీ చెప్పాడు. అంతేకాదు.. ఆ తర్వాత గృహప్రవేశానికి మిమ్మల్నిప్రత్యేకంగా పిలవాలని కృష్ణగారు చెప్పారంటూ విజయనిర్మల ఫోన్ చేసి చెప్పటంతో వెళ్లాను. ఆ సందర్భంలో ఇల్లు మొత్తం చూపించారు. విషయాన్ని అర్థమయ్యేలా చెబితే అందరూ పాటిస్తారు. అందులో లాజిక్ తో చెబితే వింటారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.