Begin typing your search above and press return to search.

మళ్లీ తెరపైకి ఏయన్నార్

By:  Tupaki Desk   |   12 April 2015 5:00 AM IST
మళ్లీ తెరపైకి ఏయన్నార్
X
తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న 'దొంగ రాముడు', అభిమానుల 'దేవదాసు' అక్కినేని నాగేశ్వర రావు మరోసారి వెండితెరపై అలరించనున్నారు. ఎంతపెద్ద తారలైనా కొన్ని అనివార్య కారణాల వల్ల వారు నటించిన కొన్ని సినిమాలు విడుదల కాని సందర్భాలు కోకొల్లలు. వాటిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేదు. ఆ కోవలోనే చిత్రీకరణ జరుపుకుని విడుదల కాని ఏయన్నార్ సినిమా ప్రతిబింబాలు. ఆయన నటించిన సినిమాలలో ఇదొక్కటే విడుదల కాలేదు. ఈ వాఖ్యం కూడా మరెన్నో రోజులు చెప్పుకోలెం. త్వరలోనే ఈ లోటు తీరనుంది.

80ల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దాదాపు సుమారు 30 సంవత్సరాల తర్వాత ఇపుడు విడుదలకు సిద్ధమవుతుంది. ఆ సమయంలో అక్కినేనివారు ఏడంతస్తుల మేడ, పిల్ల జమీందారు, ప్రేమాభిషేకం, మేఘసందేశం వంటి సినిమాలతో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం విడుదల కాకపోవడం నిజంగా వింతే. ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాక మునుపే దర్శకుడైన కె.సూర్య ప్రకాష్ రావు (రాఘవేంద్ర రావు తండ్రి) మరణించారు. దాంతో మిగిలిన సినిమాను మరో దర్శకుడు సినిమా ప్రయోగాల దిట్ట సింగీతం శ్రీనివాస రావు గారు పూర్తి చేశారు. ఈ చిత్రానికి మాటలు ఆచార్య ఆత్రేయ. పాటలు వేటూరి సుందర రామ్మూర్తి. జాగర్లమూడి రాధాక్రిష్ణముర్తి ఈ చిత్ర నిర్మాత. శంకరాభరణం తర్వాత తులసి ఏయన్నార్ పక్కన కథానాయికగా చేసింది. జయసుధ మరో నాయిక. ఈ చిత్రం విడుదల అయితే దిగ్గజ నటుడి ఈ చిత్రాన్ని ఎలాగైనా విడుదల చేయాలని అక్కినేని అభిమానులు ఆయన వారసుడు, ప్రముఖ సినీ కథానాయకుడు నాగార్జునకు, ఉత్తరాల ద్వారానూ.. వ్యక్తిగతంగానూ విన్నవించారట. ఈ రకంగానైన ఈ చిత్రం విడుదలయితే అటు అభిమానుల కోరికతోపాటు ఆ దిగ్గజంపై ఉన్న ఈ అపకీర్తి సైతం తొలగిపోనుంది.