Begin typing your search above and press return to search.

నాగ‌శౌర్య బ‌ర్త్ డే స‌ర్ప్రైజ్ 'కృష్ణ వ్రింద విహారి'

By:  Tupaki Desk   |   22 Jan 2022 6:06 AM GMT
నాగ‌శౌర్య బ‌ర్త్ డే స‌ర్ప్రైజ్ కృష్ణ వ్రింద విహారి
X
యంగ్ హీరో నాగ‌శౌర్య విభిన్న‌మైన క‌థ‌ల్ని ఎంచుకుంటూ స‌ర్ ప్రైజ్ చేస్తున్నారు. నిత్యం కొత్త త‌ర‌హా క‌థ‌లు, పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారాయ‌న‌. అయితే అందులో కొన్ని మిస్ ఫైర్ అవుతుండ‌గా మ‌రి కొన్ని సూప‌ర్ హిట్‌లుగా నిలుస్తున్నాయి.

ఇటీవ‌ల `వ‌రుడు కావ‌లెను` అంటూ కొత్త త‌ర‌హా చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకున్న నాగ‌శౌర్య తాజాగా మ‌రో రోమ్ - కామ్ మూవీతో రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని అనిష్ ఆర్‌. కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇది నాగ‌శౌర్య న‌టిస్తున్న 22వ చిత్రం.

కొత్త త‌ర‌హా క‌థ‌తో రూపొందుతున్న ఈమూవీని నాగ‌శౌర్య హోమ్ బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్స్ పై ఉమ మూల్పూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి `కృష్ణ వ్రింద విహారి` అనే టైటిల్ ని ఫైన‌ల్ చేశారు.

నాగ‌శౌర్య పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని కూడా చిత్ర బృందం శ‌నివారం విడుద‌ల చేసింది. చాలా ట్రెడిష‌న‌ల్ అండ్ స్పిరిట్చువ‌ల్‌ గా ప్ల‌జెంట్ గా వున్న ఈ మూవీ టైటిల్ ప‌లువురిని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

అంతే కాకుండా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో నుదిటిన నిలువుతా తిల‌కం దిద్దుకుని, చేతికి తాడు క‌ట్టుకుని, మెడ‌లో డాల‌ర్ వేసుకుని, చేతిలో రాగి చెంబుతో నీళ్లు చ‌ల్లుతూ హీరో నాగ‌శౌర్య బ్రాహ్మ‌ణ యువ‌కుడిగా క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

మిందుత్వ‌కు ప్ర‌తీక‌గా భ‌క్తిభావం తోణికిస‌లాడే అచ్చ తెలుగు అబ్బాయిగా నాగ‌శౌర్య లుక్ సినిమాపై పాజిటివ్ వైబ్ ని క‌లిగిస్తోంది. చార్మింగ్ స్మైల్ తో ఫ‌స్ట్ లుక్ లోనే శౌర్య అంద‌రికి న‌చ్చేశాడు.

గ‌త చిత్రాల‌తో పోలిస్తే ఈ చిత్రంలో నాగ‌శౌర్య పోషిస్తున్న పాత్ర చాలా కొత్త‌గా భిన్నంగా క‌నిపిస్తోంది. శౌర్య క్యారెక్ట‌ర్ ని డిజైన్ చేసిన తీరుని చూస్తుంటే ఇదొక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లా క‌నిపిస్తోంది.

ఓ సాంగ్ చిత్రీక‌ర‌ణ మిన‌హా సైలెంట్ గా ఇప్ప‌టికే షూటింగ్ మొత్తం ఆల్ మోస్ట్ పూర్తి చేశార‌ట‌.శిర్లే సేటియా ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. సీనియ‌ర్ న‌టి రాధిక శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలోని ఇత‌ర పాత్ర‌ల్లో పాపుల‌ర్ న‌టులు స‌త్య‌, బ్ర‌హ్మాజీ, క‌మెడియ‌న్ లు వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ న‌టిస్తున్నారు.

శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ‌హతి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీ‌రామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల‌ని పోషిస్తున్న ఈమూవీ ఎంట‌ర్‌టైన్ మెంట్ విష‌యంలో ఏమాత్రం డిస‌ప్పాయింట్ చేయ‌ద‌ని తెలుస్తోంది. ఈ మూవీతో నాగ‌శౌర్య సూప‌ర్ హిట్ మూవీని సొంతం చేసుకోవ‌డం గ్యారంటీ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.