Begin typing your search above and press return to search.

60 ఏళ్ళ వయసులో రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్న సీనియర్ స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   6 Nov 2020 11:50 AM GMT
60 ఏళ్ళ వయసులో రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్న సీనియర్ స్టార్ హీరో..!
X
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన 'కింగ్' అక్కినేని నాగార్జున 60 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. వైవిధ్యమైన చిత్రాలు విలక్షమైన పాత్రల్లో నటిస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన నాగ్.. కోవిడ్ నేపథ్యంలో అందరికంటే ముందు షూటింగ్ లో పాల్గొన్న స్టార్ హీరోగా నిలిచాడు. కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమాలను తిరిగి స్టార్ట్ చేయడానికి స్టార్ హీరోలందరూ భయపడుతున్న సమయంలో.. కింగ్ నాగార్జున డేరింగ్ గా సెట్స్ లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒకవైపు సినిమా షూటింగ్ మరోవైపు టెలివిజన్ షో షూట్ అంటూ కరోనా డేస్ లో కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నాడు నాగ్.

ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న 'వైల్డ్ డాగ్' షూటింగ్ ని హిమాలయాల్లోని మనాలి ప్రాంతంలో 21 రోజుల పాటు చిత్రీకరించారు. రోహతంగ్ కనుమ ప్రాంతంలో 13వేల అడుగుల ఎత్తులో ఉండే ప్రదేశంలో జరిగే షూటింగ్ లో పాల్గొన్న నాగ్.. మరోవైపు 'బిగ్ బాస్' తెలుగు సీజన్-3 రియాలిటీ షో లో కూడా పాల్గొంటూ వచ్చాడు. వీకెండ్స్ లో జరిగే షో కోసం హైదరాబాద్ కి స్పెషల్ ఛాపర్ లో వచ్చి, మళ్ళీ తిరిగి వెళ్లి చిత్రీకరణ పూర్తి చేశాడు. తాజాగా 'వైల్డ్ డాగ్' లో తన పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు నాగార్జున వెల్లడించారు.

కాగా, నాగార్జున ఈ వారాంతం 'బిగ్ బాస్' షో కి హోస్ట్ గా చేసి వెంటనే షూటింగ్ నిమిత్తం ముంబై కి వెళ్లనున్నాడని తెలుస్తోంది. నాగార్జున చాలా గ్యాప్ తర్వాత 'బ్రహ్మాస్త్ర' అనే బాలీవుడ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ - అమితాబ్ బచ్చన్ - అలియా భట్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో నాగ్ ఆర్కియాలజిస్టు పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇది వరకే కొన్ని రోజులు 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ చేసిన నాగార్జున.. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ కోసం ముంబై వెళ్లనున్నారు. నాగార్జున ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నిర్విరామంగా వర్క్ చేస్తుండటం గ్రేట్ అనే చెప్పాలి. మిగతా స్టార్ హీరోలు కూడా అక్కినేని నాగార్జున ను ఫాలో అయితే టాలీవుడ్ లో చాలా సినిమాలు త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.