Begin typing your search above and press return to search.

అఖిల్ ఎంగేజ్మెంట్ లో ఆ మూమెంట్ కేక

By:  Tupaki Desk   |   10 Dec 2016 10:16 AM IST
అఖిల్ ఎంగేజ్మెంట్ లో ఆ మూమెంట్ కేక
X
అక్కినేని నాగార్జున-అమల కుమారుడు అఖిల్ కు జీవీకే మనవరాలు శ్రేయా భూపాల్ తో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న జీవీకే హౌస్ లో.. గ్రాండ్ రేంజ్ లో ఈ వేడుక జరిగింది. అయితే.. ఎంత భారీగా ఈ ఫంక్షన్ జరిగినా ఈ ఫంక్షన్ ను ఫ్యామిలీ ఈవెంట్ గానే జరిపి.. మీడియాను దూరంగా ఉంచారు. కానీ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను మాత్రం షేర్ చేసింది అక్కినేని ఫ్యామిలీ.

మొత్తం ఫోటోల్లో ఒకదాని గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిందే. నాగార్జున మధ్యలో ఉండగా.. ఆయనకు ఒకవైపు నిశ్చితార్ధం అయిన జంట అఖిల్-శ్రేయాలు.. మరోవైపు నాగ చైతన్య-సమంతలు ఉన్న పిక్ మాత్రం కలర్ ఫుల్ గా ఉంది. ఇద్దరు కొడుకులు ఆ చివరా ఈ చివరా.. పక్కనే వారి కాబోయే భార్యలు.. మధ్యలో నాగ్. కొడుకులు-కోడళ్లతో నాగార్జన దిగిన ఫోటో మాత్రం కేకలు పెట్టించేసింది.

ఫ్యామిలీ స్టేట్మెంట్ అంటే ఎలా ఉంటుందో చెప్పినట్లుగా ఉంది ఈ ఫోటో. అలాగే కొత్త జంటతో కలిసి దిగిన మరో ఫ్యామిలీ ఫోటోలో అమల పక్కన నాగచైతన్య ఉన్న ఫోటో కూడా కనుల విందుగా ఉంది అక్కినేని అభిమానులకి.