Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఇంట.. నాగ్ నవ్వుల పంట..

By:  Tupaki Desk   |   18 Jan 2016 1:30 PM GMT
మెగాస్టార్ ఇంట.. నాగ్ నవ్వుల పంట..
X
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు, అక్కినేని నాగార్జునకు సత్సంబంధాలు చాలానే ఉన్నాయి. ఆ మాటకొస్తే, బాలీవుడ్ లో చాలామందితో నాగ్ కు సఖ్యత ఉంటుంది కానీ.. బిగ్ బీతో కాస్త ఎక్కువగా ఉంటుంది. అప్పుడెప్పుడో కలిసి నటించిన ఖుదా గవా చిత్రం నుంచీ ఈ రిలేషన్ మెయింటెయిన్ అవుతోంది. రీసెంట్ గా కూడా అమితాబ్ - నాగ్ లు ఒకే యాడ్ లో కలిసి నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అంతే కాదు.. నాగ్ ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీసిన మనం సినిమాలో కూడా.. అమితాబ్ తో ఓ చిన్న పాత్ర చేయించి, తమ మధ్య ఉన్న అనుబంధాన్ని ఇన్ డైరెక్టుగా చెప్పాడు నాగార్జున. ఇప్పుడు కూడా ఆ బ్రాండ్ యాడ్స్ కు వీళ్లు అంబాసిడర్లుగా కంటిన్యూ అవుతున్నారు. ఇదే ప్రకటనకు కోలీవుడ్ సీనియర్ హీరో ప్రభు కూడా అంబాసిడరే. వీళ్లతో మరో కొత్త యాడ్ తీసేందుకు ఆ కంపెనీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సందర్భంగా అమితాబ్ ఇంటికి నాగ్ వెళ్లారు. అమితాబ్ - జయా బచ్చన్ - స్నేహితుడు ప్రభులను కలవడం చాలా హ్యాపీగా ఉందంటూ ట్వీట్ చేశారు.

తామందరూ కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్న ఓ ఫోటోను కూడా ట్వీట్ చేశాడు నాగ్. తనకు అమితాబ్ బచ్చన్ దంపతులను కలవడం ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుందని చెబుతున్నాడు నాగ్. ఇలా యాడ్ కోసమే అయినా, అందరూ కలిసే సందర్భం రావడం అన్నది తనకు చాలా సంతోషాన్ని ఇస్తోందని నాగార్జున అంటున్నారు.