Begin typing your search above and press return to search.
సమంతకు నాగార్జున వార్నింగ్
By: Tupaki Desk | 22 Jan 2017 10:24 AM GMTచాన్నాళ్లుగా పరిచయమున్న వ్యక్తులతో అనుకోకుండా బంధుత్వం కుదిరితే.. వాళ్లను కొత్తగా ఏమని పిలవాలో అన్న సంశయం రావడం సహజం. ఇప్పుడు సమంతకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. అక్కినేని నాగార్జునతో ఆమెకు ఎప్పట్నుంచో పరిచయముంది. ‘మనం’ సినిమాలో వాళ్లిద్దరూ కలిసి నటించారు. తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో నాగార్జునను కలిసింది సామ్. ఐతే ఇంతకుముందు నాగ్ సార్.. నాగ్ సార్.. అని సంబోధించే సమంతకు ఇప్పుడు తనకు ఆయన్ని ఎలా పిలవాలో తెలియక ఇబ్బంది పడుతోంది. నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్యను సమంత ప్రేమించడం.. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతోండటం తెలిసిందే.
నాగార్జునకు 56 ఏళ్ల వయసు వచ్చేసినా ఇప్పటికీ నవ మన్మథుడిలాగే ఉన్నాడు. మరి మీ ఇంట్లోకి రాబోయే కోడళ్లు మిమ్మల్ని ఏమని పిలుస్తారు అని నాగార్జునను అడిగితే.. ‘‘నన్ను మామయ్య అని పిలవడానికి నా కోడళ్లకు ఇబ్బందిగా ఉంటుందేమో. అఖిల్ కు కాబోయే భార్య శ్రియ భూపాల్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. నన్ను ఆమె నాగ్ మామా అని పిలుస్తుంది. సమంతకే ఈ విషయంలోనే కొంచెం సమస్య. నన్ను ఎలా పిలుస్తావ్.. అని సామ్ ను అప్పుడప్పుడూ అడుగుతుంటా. తనేమో నవ్వేసి ఊరుకుంటుంది. తనను మామూలుగా నాగ్ సార్ అని సమంత పిలుస్తుందని.. ఐతే ఇకపై అలా పిలిస్తే చంపేస్తానని సమంతకు వార్నింగ్ ఇచ్చినట్లు నాగ్ తెలిపాడు. ఐతే సమంత మాత్రం తనను ఏమని పిలవాలో ఇంకా నిర్ణయించుకోలేదని నవ్వేశాడు నాగ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/