Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కు కరోనా సోకడంతో వెంటనే టెస్ట్ చేయించుకున్న నాగ్..!

By:  Tupaki Desk   |   9 Nov 2020 6:00 PM GMT
మెగాస్టార్ కు కరోనా సోకడంతో వెంటనే టెస్ట్ చేయించుకున్న నాగ్..!
X
మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ బారిన పడినట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. 'ఆచార్య' షూటింగ్‌ ప్రారంభించాలనే ఉద్దేశ్యంలో కరోనా టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలిందని.. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని.. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరూ టెస్ట్ చేయించుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. చిరు కు కరోనా సోకిందనే విషయం తెలియగానే వెంటనే 'కింగ్' అక్కినేని నాగార్జున కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిజల్ట్ రేపు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల చిరంజీవితో కలిసి తెలంగాణా ముఖ్యమంత్రిని నాగార్జున కలిసారు. అందుకే నాగ్ కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, టాలీవుడ్ లో అందరి కంటే ముందుగా సెట్స్ లో అడుగుపెట్టిన స్టార్ హీరో నాగార్జున.. 'వైల్డ్ డాగ్' మరియు 'బిగ్ బాస్' షో షూటింగ్ నేపథ్యంలో రెగ్యులర్ గా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాడు. నెగెటివ్ అని తేలడంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తెలుసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే హిమాలయాల్లో 'వైల్డ్ డాగ్' షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడు. ఈ షెడ్యూల్ తో 'వైల్డ్ డాగ్' చిత్రంలోని తన పార్ట్ చిత్రీకరణ కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు నాగ్ కి కోవిడ్ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ గా వస్తే మాత్రం 'బిగ్ బాస్' షో కి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని వారాల పాటు హోస్ట్ చేసే పరిస్థితి ఉండదు. నాగార్జున మాత్రం తనకు కరోనా నెగెటివ్ అని రిజల్ట్ వస్తుందని నమ్మకంగా ఉన్నాడని తెలుస్తోంది.