Begin typing your search above and press return to search.

అఖిల్ కోసం నాగ్ వాయిస్ ఇస్తాడా?

By:  Tupaki Desk   |   11 Nov 2017 5:11 AM GMT
అఖిల్ కోసం నాగ్ వాయిస్ ఇస్తాడా?
X
ఓటముల్లో ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీలో నెక్స్ట్ చిత్రాల కోసం వాడే చిట్కాలు చాలా డిఫెరెంట్ గా ఉంటాయని చెప్పాలి. సినీ ప్రేక్షకులను మళ్లీ మెప్పించాలని చాలా ప్రయోగాలు చేస్తారు. అందులో ఒక్కటి సక్సెస్ అయినా చాలు సినిమాకు ప్రమోషన్స్ వచ్చినట్టే. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ కూడా అఖిల్ సినిమా కోసం అదే తరహాలో ఆలోచిస్తోంది. మొదటి సినిమాతో ఊహించని విధంగా పరాజయాన్ని అందుకున్న అఖిల్ ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రస్తుతం సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోవచ్చింది. నెక్స్ట్ మంత్ క్రిస్మస్ కానుకగా సినిమాను రిలీజ్ చేస్తామని.. డిసెంబర్ 22 అంటూ ఎప్పుడో డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. దీంతో సినిమాకి ఇప్పటి నుంచే క్రేజ్ తేవాలని అనుకుంటున్నారట నాగ్. నవంబర్ మూడో వారంలో ఎలాగైనా మంచి టీజర్ ని రెడీ చేయించి దానికి నాగ్ తన వాయిస్ జోడించి ప్రేక్షకులకు అందించనున్నారట.

ప్రస్తుతం ఈ చర్చలు చిత్ర యూనిట్ మధ్య చాలానే జరుగుతున్నాయని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. నాగ్ వాయిస్ ఓవర్ తో హలో టీజర్ ఉండనుందని దర్శకుడు విక్రమ్ కుమార్ అందుకు సన్నాహకాలు కూడా చేస్తున్నాడని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమే తెలియదు గాని నాగ్ మాత్రం కొడుకు సంతోషం కోసం అన్నట్టుగానే చాలా కష్టపడుతున్నాడని చెప్పవచ్చు.