Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 3 దొరికాడా?

By:  Tupaki Desk   |   24 April 2019 4:09 AM GMT
బిగ్ బాస్ 3 దొరికాడా?
X
అటువైపు చూస్తేనేమో హిందీలో బిగ్ బాస్ రియాలిటీ షో బ్లాక్ బస్టర్. తమిళ్ లో భారీ స్పందన దక్కింది. నయనతార లాంటి వాళ్ళు సైతం యాంకరింగ్ కు ఆసక్తి చూపుతున్నారు. ఎటొచ్చి తెలుగులోనే ప్రతిసారి దీనికి పురిటి నొప్పులు తప్పడం లేదు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసున్నప్పటికీ మూడో సిరీస్ కు యాంకర్ ను సెట్ చేయడం స్టార్ మా పెద్ద గుదిబండగా మారింది.

గత కొంత కాలంగా వెంకటేష్ - అల్లు అర్జున్- విజయ్ దేవరకొండ-రానా అంటూ ఏవేవో పేర్లు వినిపించాయి కానీ అసలు ఎవరు ఫైనల్ అవుతారో అంతు చిక్కని పరిస్థితి. ఆఖరిగా సీన్లోకి కింగ్ నాగార్జున ఎంటర్ కాబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. దాదాపు డీల్ ఓకే అయ్యిందని అగ్రిమెంట్ లాంటి ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని రేపో ఎల్లుండో ట్రయిల్ షూట్ కూడా చేస్తారని తెలిసింది

ఒకరకంగా నాగార్జున మంచి ఛాయస్. మీలో ఎవరు కోటీశ్వరుడిని నడిపించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ పోలిక రావడం వల్లే చిరంజీవి ఆ స్థాయిలో మెప్పించలేదే అన్న కామెంట్స్ వచ్చాయి. సో బిగ్ బాస్ 3కి నాగ్ కంటే బెటర్ ఆప్షన్ లేరు అనుకోవచ్చు. ఫస్ట్ సీజన్ ని జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ చేసినా అనవసరమైన వివాదాలు ఆర్మీ పేరుతో పార్టిసిపెంట్స్ చేసిన రచ్చ వల్ల సెకండ్ సీజన్ నానికి తలనొప్పిగా మారింది. ఏదోలా ముగించాడు కానీ కొంత అసంతృప్తి తనలో ప్రేక్షకుల్లో ఇద్దరిలోనూ ఉంది.

ఇవన్నీ బాలన్స్ చేయడానికి బిగ్ బాస్ 3లో చాలా మార్పులే చేశారట.నాగార్జున లాంటి సీనియర్ హీరో అయితేనే ఈ ఒత్తిడిని తట్టుకుంటారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ,మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.